కోరిక తీర్చ‌లేద‌ని చంపేసిన బాలుడు

Crime News పై ఫోటోలో క‌నిపిస్తున్న యువ‌కుడి వ‌య‌సు 18. ఆ ప‌క్క‌నే ఉన్న యువ‌తి వ‌య‌సు 34. ఎంత వ్య‌త్యాసం ఉందో చూసారా? ఆ అమ్మాయి వీడి కోరిక తీర్చ‌లేద‌ని దారుణంగా హ‌త్య చేసాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ష‌ర్మిళ అనే యువ‌తి రామ‌మూర్తి న‌గ‌ర్‌లోని సుబ్ర‌హ్మ‌ణ్య లేఅవుట్‌లో ఉన్న ఫ్లాట్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తోంది. ఆ ప‌క్క ఫ్లాట్‌లోనే క‌ర్న‌ల్ కురాయ్ అనే 18 ఏళ్ల యువ‌కుడు నివ‌సిస్తున్నాడు. కురాయ్‌కి ఎప్ప‌టి నుంచో ష‌ర్మిళ‌పై క‌న్నుంది.

ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 3న కురాయ్ ష‌ర్మిళ ఫ్లాట్‌లోకి చొర‌బ‌డి కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో నోరు నొక్కి ప‌ట్టుకున్నాడు. దాంతో ష‌ర్మిళ ఊపిరాడ‌క చ‌నిపోయింది. పోలీసుల‌కు అనుమానం రాకుండా.. ష‌ర్మిళ‌కు సంబంధించిన కొన్ని సామాన్లు, దుస్తుల‌ను మంచం కింద దాచి నిప్పు పెట్టి పారిపోయాడు. దాంతో స్థానికులు ఫ్లాట్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో ష‌ర్మిళ ఊపిరాడ‌క చ‌నిపోయింద‌ని పోలీసుల‌కు చెప్పారు. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా విచార‌ణ చేయించ‌డంతో ష‌ర్మిళ‌ది హ‌త్య అని తేలింది. ఆ త‌ర్వాత కురాయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా నేరాన్ని అంగీక‌రించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *