Saif Ali Khan: బాలీవుడ్ న‌వాబ్.. ఆస్తి ఎంతో తెలుసా?

Saif Ali Khan:  బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. యావ‌త్ భార‌త‌దేశం ఈ వార్త‌తో ఉలిక్కిప‌డింది. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ అంటే చిన్న సెల‌బ్రిటీ కాదు. పైగా ఆయ‌న ముంబైలోని అత్యంత సెక్యూరిటీ క‌లిగిన బాండ్రా ప్రాంతంలో ఉంటారు.  అలాంటి సైఫ్ లాంటి సెల‌బ్రిటీకే భ‌ద్ర‌త లేక‌పోతే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంటి అనే చ‌ర్చ మొద‌లైపోయింది. నిన్న రాత్రి 2 గంట‌ల సమ‌యంలో ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు.

సైఫ్ త‌న భార్య క‌రీనా క‌పూర్, పిల్ల‌లతో క‌లిసి నాలుగ‌వ‌ అంత‌స్తులో ఉంటారు. అంత సెక్యూరిటీని దాటుకుని మ‌రీ 11వ అంత‌స్తులోకి దుండ‌గుడు ఎలా వెళ్లాడు అనే విష‌యంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏదో చ‌ప్పుడు అయిన‌ట్లు వినిపిస్తే సైఫ్ హాల్‌లోకి వ‌చ్చాడ‌ట‌. అదే స‌మ‌యంలో దుండ‌గుడు పారిపోవ‌డానికి య‌త్నిస్తుండ‌గా సైఫ్ అత‌న్ని ప‌ట్టుకునేందుకు య‌త్నించాడు. అప్పుడు ఇంట్లోనే ఉంటున్న ఓ ప‌నిమ‌షి కూడా దుండ‌గుడిని ప‌ట్టుకోవాల‌ని చూసింది. కానీ అత‌ను ఆమెపై క‌త్తితో దాడి చేయ‌బోతుండ‌గా సైఫ్ వెంట‌నే క‌త్తి లాక్కునేందుకు య‌త్నించాడ‌ట‌. దాంతో ఆ దుండుగుడు సైఫ్ ఒంటిపై ఆరు సార్లు విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచేసాడు. వెన్నెముక‌, మెడ భాగంలో లోతుగా క‌త్తిగాట్లు ప‌డ్డాయి. వెంట‌నే పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకోగా అప్ప‌టికే దుండగుడు పారిపోయాడు. (Saif Ali Khan)

వెంట‌నే సైఫ్‌ను లీలావ‌తి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ముగ్గురు వైద్యులు ఆయ‌న‌కు స‌ర్జ‌రీ చేసారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అన్నారు. క‌రీనా, పిల్ల‌లు ఇంకా షాక్ నుంచి తేరుకోలేద‌ని.. ఈ స‌మ‌యంలో మీడియా సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌రీనా మేనేజ‌ర్ వెల్ల‌డించారు. ఇక‌పోతే.. సైఫ్‌ని బాలీవుడ్ న‌వాబ్ అంటారు. ఎందుకంటే ఆయ‌న దివంగ‌త మాజీ క్రికెట‌ర్ మ‌న్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడుకు. వీరిది రాజ కుటుంబం. మ‌న్సూర్ అలీ ఖాన్ అల‌నాటి బాలీవుడ్ న‌టి ష‌ర్మిళా ఠాగూర్‌ని పెళ్లి చేసుకుని సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, స‌బా అలీ ఖాన్‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు.  సైఫ్‌ని న‌వాబ్ ఆఫ్ బాలీవుడ్ అని పిలుస్తుంటారు. ఆయ‌న ఆస్తి విలువ రూ.1300 కోట్లు.

ముంబైలోని బాండ్రాలో ఆయ‌న ఉంటున్న ఇల్లు నాలుగు అంత‌స్తుల్లో నిర్మించారు. దీని ధరే దాదాపు రూ.300 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. దీంతో పాటు వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ప‌టౌడీ ప్యాలెస్ కూడా సైఫ్ సొంతం. కాక‌పోతే అంద‌రూ క‌లిసే అక్క‌డికి వెళ్లి పార్టీలు, సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటూ ఉంటారు. సైఫ్‌, క‌రీనాకి ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్‌లో టైగ‌ర్స్ ఆఫ్ క‌ల‌క‌త్తా అనే టీం కూడా ఉంది. ఇద్ద‌రూ బాలీవుడ్‌లో ప‌వ‌ర్ క‌పుల్. సంవ‌త్స‌రానికి వీరిద్ద‌రూ క‌లిపి రూ.100 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తున్నారు.

అయితే.. బాండ్రా అనేది బాలీవుడ్ వారికి ప్ర‌ధాన అడ్డా. హైద‌రాబాద్‌లో సెల‌బ్రిటీలంతా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌లో ఎలా ఉంటారో.. ముంబైలోని బాండ్రాలో దాదాపు 80% సెల‌బ్రిటీలు నివ‌సిస్తుంటారు. అక్క‌డే స‌ల్మాన్ ఖాన్, ర‌వీనా టాండ‌న్ వంటి చాలా మంది సెల‌బ్రిటీల ఇళ్లు ఉన్నాయి. దొంగ‌తనానికి వ‌చ్చిన వాడు సైఫ్ ఇంట్లోకే ఎందుకు చొర‌బ‌డ్డాడు? అస‌లు అంత ప‌క‌డ్బందీగా ఉండే ఇంట్లోకి చొర‌బ‌డుతుంటే సీసీ కెమెరాలో ఎవ్వ‌రికీ క‌నిపించ‌లేదా? బ‌య‌ట సెక్యూరిటీ గార్డు ఏం చేస్తున్నాడు? వంటి ఎన్నో సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రోప‌క్క ఇది కేవ‌లం సైఫ్ ఇంట్లో చోరీకి వ‌చ్చిన ఓ సామాన్య దొంగ ప‌నా లేక సైఫ్‌పై వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు ఎవ‌రికైనా ఉన్నాయా అనే కోణంలోనూ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. (Saif Ali Khan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *