Rohit Sharma: కారుకి ఏమైంది రా..

Rohit Sharma: అన్నద‌మ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు త‌మ‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను డ్యామేజ్ చేస్తే ఎంత‌గా గొడ‌వ ప‌డ‌తారో అంద‌రికీ తెలిసిందే. తోబుట్టువుల‌తో ఉండే స‌ర‌దా గొడ‌వ‌లు ప్ర‌తి ఇంట్లో జ‌రుగుతూనే ఉంటాయి. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అతీతం కాదు. నిన్న ముంబైలోని వాంఖెడె స్టేడియంలో రోహిత్ శ‌ర్మ పేరిట స్టాండ్‌ను ప్రారంభించిన కార్య‌క్ర‌మానికి హిట్ మ్యాన్ త‌న కుటుంబంతో హాజ‌ర‌య్యాడు. భార్య రితిక‌, త‌ల్లిదండ్రుల‌తో పాటు సోద‌రుడు విశాల్ కూడా వ‌చ్చారు.

అయితే.. కార్య‌క్ర‌మం త‌ర్వాత అంద‌రూ వెళ్లిపోతుండ‌గా.. రోహిత్ కారు ఎక్కుతూ కారుపై ఉన్న స్క్రాచ్‌ను చూసాడు. వెంట‌నే త‌న సోద‌రుడు విశాల్‌ని ఇదేంటి అని అడిగితే.. కారు రివ‌ర్స్ చేస్తుంటే గీత ప‌డింది అని చెప్పాడు. దాంతో రోహిత్ కోపంతో విశాల్‌కు ఇచ్చిన యాంగ్రీ లుక్ తెగ వైర‌ల్‌గా మారింది. అంద‌రి ముందు రోహిత్ ఇంత‌కుమించి ఏమీ అన‌లేక‌పోయాడ‌ని.. ఇంటికెళ్లాక క‌చ్చితంగా గొడ‌వ‌డ‌తారంటూ నెటిజన్లు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *