రాశి గారి ఫ‌లాలు.. ఏంటిది?

Raasi కొద్ది రోజులుగా యాంక‌ర్ అనసూయ వ‌స్త్ర విధానంపై ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడు శివాజీ హీరోయిన్ వేసుకునే దుస్తులపై కామెంట్స్ చేయ‌డం.. ఆ త‌ర్వాత అన‌సూయ కౌంట‌ర్ వేయ‌డంతో ఈ దుమారం మొదలైంది. చూడ‌బోతే ఇప్పుడిప్పుడే ఈ టాపిక్ ఆగేలా లేదు. అయితే.. ఈ అంశంపై సీనియ‌ర్ న‌టి రాశి త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న దుమారం గురించి త‌న‌కూ తెలిసింద‌ని.. ఈ విష‌యంలో తాను ఎవ‌రి ప‌క్షాన ఉండి స‌పోర్ట్ చేయ‌డం లేదు కానీ ఒక విష‌యం మాత్రం క‌చ్చితంగా చెప్పాల‌నుకుంటున్నాన‌ని అన్నారు.

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలోని ఓ స్కిట్‌లో రాశిఫ‌లాలు అని ఓ క‌మెడియన్ అంటే అక్క‌డే ఉన్న యాంక‌ర్ రాశి గారి ఫ‌లాలా అని అడిగింద‌ని.. ఆ ద‌రిద్ర‌పు గొట్టు జోక్‌కి జ‌డ్జిలుగా ఉన్న‌వారు కూడా న‌వ్వుకున్నార‌ని ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు. త‌న‌కు టాలీవుడ్ ఇచ్చిన పేరు రాశి.. త‌మిళంలో మంత్ర అని పిలుస్తార‌ని.. త‌న పేరును ప్ర‌స్తావించి బాడీ షేమింగ్ చేసారు కాబ‌ట్టి స్పందిస్తున్నాన‌ని తెలిపారు. దీనిపై లీగ‌ల్‌గా వెళ్దామ‌నుకున్నాను కానీ అస‌లు ఈ కేసుల నుంచి నీకేం కావాలి అని త‌న తల్లి ప్ర‌శ్నించ‌డంతో నిజ‌మే క‌దా అని ఊరుకున్నాన‌ని తెలిపారు. అంద‌రూ హాయిగా సంతోషంగా ఉండ‌క ఇలాంటివాటికి జోలికి వెళ్లి ఎందుకు అల్లరిపాల‌వుతున్నారు అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *