Donald Trump: అమ్ముడుపోలేదు.. అంట‌గ‌ట్టారు

Donald Trump: ఖతార్ రాజ‌కుటుంబం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని వెర్రోడిని చేసింది. ఇటీవ‌ల ఖ‌తార్ రాజ‌కుటుంబం ట్రంప్‌కు బోయింగ్ 747 జంబో జెట్‌ను కానుక‌గా ఇచ్చింది. దీనిని ఫ్ల‌యింగ్ ప్యాలెస్ అని కూడా అంటారు. అంటే విమానం లోప‌ల మొత్తం ఒక ప్యాలెస్‌లో ఉండే అన్ని సౌక‌ర్యాలు ఉంటాయి. మూడు బెడ్రూంలు, మూడు బాత్రూంలు, రెండు కిచెన్లు, 40 టీవీలు, ప్రైవేట్ ఆఫీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

దీనిని ట్రంప్ తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వ‌న్‌గా వాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే రాజ‌కుటుంబం కానుక ఇవ్వ‌గానే సిగ్గులేకుండా తీస్కోడ‌మేనా? అధ్య‌క్షుడికి ఉండాల్సిన క‌నీస జ్ఞానం కూడా లేదా? అంటూ ట్రంప్‌పై చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. రాజ‌కుటుంబం నుంచి అంత మంచి కానుక వ‌స్తుంటే వ‌దులుకోవ‌డానికి నేనేమైనా ఫూల్‌నా అని అన్నారు. కానీ పాపం ట్రంప్‌కి తెలీని విష‌యం ఏంటంటే.. ఆయ‌న్ను నిజంగానే ఖ‌తార్ రాజ‌కుటుంబం ఫూల్‌ని చేసింది.

మ‌న ద‌గ్గ‌ర ఏద‌న్నా ఒక వ‌స్తువు ఉండి దాంతో మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగం లేద‌నుకుంటే ఇంట్లో ప‌నిచేసే వారికో లేదా అవ‌స‌రం ఉన్న‌వారికో ఇచ్చేస్తుంటాం. ఇప్పుడు ఆ ఖ‌తార్ రాజ‌కుటుంబం చేసింది కూడా అదే. వాళ్ల‌కి ఆ బోయింగ్ 747 జంబో జెట్‌తో ప‌నేం లేద‌ట‌. పైగా త‌మ ప్యాలెస్‌లో అలా ప‌డుంది. ఈ రాజ‌కుటుంబం ద‌గ్గ‌ర ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే త‌మ‌కు అవ‌స‌రం అయినంత వ‌ర‌కు మాత్ర‌మే ఉంచుకుని మిగ‌తావి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్‌కి బోయింగ్ 747 కూడా అలా ఇచ్చిందే. (Donald Trump)

ఈ బోయింగ్ 747ను ఖ‌తార్ రాజ‌కుటుంబీకులు 2020లో వేలానికి పెడితే ఒక్క‌డూ కొనేందుకు ముందుకు రాలేదు. దాంతో మెయింటైనెన్స్, స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ‌గా ఉండ‌టంతో చేసేదేం లేక దానిని ట్రంప్‌కి కానుక‌గా ఇచ్చేసారు. ఈ బోయింగ్ జెట్‌ను 2012లో 367 మిలియ‌న్ డాల‌ర్ల‌కు కొన్నారు. మ‌రోప‌క్క ట్రంప్ కోసం ప్ర‌త్యేకంగా బోయింగ్ త‌యారుచేస్తున్న కొత్త ఎయిర్ ఫోర్స్ వ‌న్ ఇంకా రెడీ కాలేదు. కాస్త స‌మ‌యం ప‌డుతుంది. అందుకే అప్ప‌టివ‌ర‌కు త‌న‌కు అప్ప‌నంగా వ‌చ్చిన 747ను వాడుకుంటాన‌ని ట్రంప్ తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *