HIT 3: పై ఫోటో చూడగానే మీకు కూడా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌లా ఉన్నాడే అనుకున్నారు కదూ..! అవును.. హిట్ 3 కొత్త పోస్టర్ రిలీజ్ అవ్వగానే నేచురల్ స్టార్ నాని లుక్ చూసి దాదాపు నెటిజన్లు అదే అనుకున్నారు. అయ్యో నాని మీరా.. హృతిక్ రోషన్ అనుకున్నాం అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నాని అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని ఆశిస్తున్నారు. మరి అర్జున్ సర్కార్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. మే 1న సినిమా రిలీజ్ కానుంది.