Mohsin Naqvi Apologises: ఆసియా కప్ ట్రోఫీ చోర్గా ట్రోల్స్ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహసిన్ నఖ్వీ ఎట్టకేలకు దిగొచ్చాడు. టీమిండియా పట్ల తాను ప్రవర్తించిన తీరుకు BCCIని క్షమాపణలు కోరాడు. అయితే.. ఆసియా కప్ ట్రోఫీని మాత్రం తాను ఇవ్వనని అంటున్నాడు. మరోపక్క ఇండియాకు రావాల్సిన ట్రోఫీతో పాటు మెడల్స్ని కొరియర్ చేయాలని BCCI డిమాండ్ చేస్తోంది. కానీ నఖ్వీ మాత్రం అది జరగదని.. ట్రోఫీ కావాలంటే కెప్టెన్గా వ్యవహరించిన సూర్య కుమార్ యాదవ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్ వచ్చి తీసుకోవాల్సిందేనని అంటున్నాడు.