Maruthi ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాను మరోసారి చూడాలని అభిమానులకు, ఆడియన్స్కు విజ్ఞప్తి చేసారు దర్శకుడు మారుతి. ఏదన్నా సినిమాను ఒకసారి చూస్తే సినిమా కథ మాత్రమే అర్థమవుతుందని.. రెండోసారి చూస్తే అప్పుడు ఆ కథలో ఉన్న లోతు తెలుస్తుందని తెలిపారు. మూడేళ్ల పాటు కష్టపడి సినిమా తీసి దానిని మూడు గంటల్లో జనాలకు చూపిస్తే అభినందించాల్సిందిపోయి ట్రోల్స్ చేస్తున్నారని.. ఇలా ట్రోల్స్ చేస్తున్నవారు భవిష్యత్తులో కచ్చితంగా అనుభవిస్తారు అని ఆయన కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.