రోజాకు ఆ వీడియోలు చూడ‌టం అల‌వాటు

Kiran Royal తిరుప‌తికి చెందిన జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు.

రోజాకు న‌గ్న వీడియోలు చూసే అల‌వాటు బాగా ఉంద‌ని ఆ అల‌వాటు త‌న‌కు లేద‌ని అన్నారు. రైల్వే కోడూరు జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ రాసలీల‌లు వీడియోల రూపంలో బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు యాక్ష‌న్ తీసుకోక‌పోవ‌డంపై రోజా నిన్న ఓ కామెంట్ చేసారు.

క‌ళ్ల ముందే వీడియోల్లో అంత క్లియ‌ర్‌గా క‌న‌ప‌డుతుంటే త‌ప్పు చేసాడో లేదో త్రిస‌భ్య క‌మిటీ వేసి విచార‌ణ చేప‌డ‌తాం అని ప‌వ‌న్ అన్నార‌ని.. ఆ వీడియోల‌ను బ్ల‌ర్ లేకుండా ప‌వ‌న్‌కు పంపితే అప్పుడైనా యాక్ష‌న్ తీసుకుంటార‌ని రోజా వ్యాఖ్యానించారు.

దీనిపై కిర‌ణ్ రాయ‌ల్ స్పందిస్తూ.. అలాంటి న‌గ్న వీడియోలు రోజాకు మాత్ర‌మే చూసే అల‌వాటు ఉంది కాబ‌ట్టి ఆవిడ ఇలాంటి చూస్తుంటార‌ని.. త‌మ‌కు త‌మ పార్టీ అధినేత‌కు ఇలాంటివి చూసే అల‌వాటు లేద‌ని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *