KGF 2 సినిమాకు కో డైరెక్టర్‌గా వ్యవహరించిన కీర్తన్ నడగౌడ కుటుంబంలో జీర్ణించుకోలేని విషాదం నెలకొంది. కీర్తన్, సమృద్ధి పటేల్ దంపతుల నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా ధృవీకరిస్తూ నివాళులు అర్పించారు. కీర్తన్, సమృద్ధిల కుమారుడు సోనార్ష్ లిఫ్ట్ ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. ఈ సమయంలో సోనార్ష్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని.. సోనార్ష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.