Jemimah Rodrigues మహిళల క్రికెట్ టీంలో జెమీమా రోద్రీగ్స్ కీలక ప్లేయర్. మహిళల ప్రపంచ కప్ విజయంలో జెమీమాది సింహభాగం. అయితే.. జెమీమా ఓ ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో జరిగిన సంఘటన గురించి చెప్పడం వైరల్‌గా మారింది. ఆమె చనిపోయిందనుకుని వదిలేసారట. జెమీమాకు అప్పుడు పదేళ్లట. ఓ చర్చి ఆడిటోరియంలో తన కజిన్స్‌తో స్లిప్పర్ ఫైట్ ఆట ఆడుకుంటుంటే చెప్పు ఎగిరి రిస్కీ ప్రదేశంలో పడిందట.
ఆ చెప్పు కోసం వెళ్లిన జెమీమా ఆడిటోరింలోని మొదటి అంతస్తు నుంచి పడిపోయిందట. కింద పడిన జెమీమా కనిపించకపోవడంతో ఆమె చనిపోయిందనుకున్నారట. ఆ తర్వాత చూస్తే స్వల్ప గాయాలతో అక్కడే కూర్చుని ఏడుస్తుండడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారంటూ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. WPL 2026 సీజన్‌లో జెమీమా ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనుంది.





