Solar Eclipse 2025: ఉగాది వేళ‌ తొలి సూర్య గ్ర‌హ‌ణం.. ప్ర‌మాద‌క‌ర‌మా?

Solar Eclipse 2025:  2025 సంవ‌త్స‌రంలో మొత్తం నాలుగు గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ‌నున్నాయి. వాటిలో రెండు సూర్య గ్ర‌హ‌ణాలు.. రెండు చంద్ర‌ గ్ర‌హ‌ణాలు ఉండ‌నున్నాయి. గ్ర‌హణాల‌కు సంబంధించి చాలా మంది చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు.. సందేహాలు ఉంటాయి. గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ఏ రాశి వారికి బాగుంటుంది.. ఏ రాశి వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని తెగ వెతికేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది స‌మ‌యంలో రాబోయే తొలి గ్ర‌హణం.. సూర్య గ్ర‌హ‌ణం. ఈ గ్ర‌హ‌ణం గురించి చాలా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది చాలా భ‌యంక‌ర‌మైన గ్ర‌హ‌ణం అని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం. ఈ ఏడాది తొలి సూర్య‌గ్ర‌హ‌ణం మార్చి 29న రాబోతోంది. అంటే.. మ‌న హిందూ క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఛైత్ర మాసం మొద‌లు కావ‌డానికి ఒక రోజు ముంద‌న్న మాట‌. ఇది పాక్షిక సూర్య గ్ర‌హ‌ణంగా ఏర్ప‌డ‌నుంది. భార‌త‌దేశంలో క‌నిపించ‌ద‌ట‌. మ‌ధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రం 6:13 వ‌ర‌కు ఈ సూర్య గ్ర‌హ‌ణం ఉంటుంది.

గ్ర‌హణం ఏ దేశాల్లో క‌నిపిస్తుంది?

ఉత్త‌ర అమెరికా

ఐస్‌ల్యాండ్

గ్రీన్ ల్యాండ్

ఉత్త‌ర అట్లాంటిక్ మ‌హాస‌ముద్రం

యూర‌ప్

నార్త్ వెస్ట్ర‌న్ ర‌ష్యా (Solar Eclipse 2025)

ఎప్పుడు గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డినా కూడా అదేదో భూమి అంత‌మైపోతుంది అన్న రేంజ్‌లో కొంద‌రు ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటారు. హిందువులు ధ‌ర్మంగా.. శాస్త్రోక్తంగా పాటించే కొన్ని నియ‌మాలు పాటిస్తే స‌రిపోతుంది. అంతే కానీ గ్ర‌హణం చాలా భ‌యంక‌ర‌మైన‌ది.. ఆ రోజు ఏదో జ‌రిగిపోతుంది అని భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా కొంద‌రు పనికిమాలిన జ్యోతిష్యులు ఈ పూజ‌లు చేయించుకోండి.. ఈ హోమాలు చేయించుకుంటే మంచి జ‌రుగుతుంది.. లేదంటే మీ జీవితం అల్ల‌క‌ల్లోలంగా మారిపోతుంది అని చెప్తుంటారు. వీరిని మాత్రం అస్స‌లు న‌మ్మ‌కండి. ఇలాంటి వాళ్లు హోమాలు, పూజ‌లు చేస్తారు కానీ వేల‌ల్లో డ‌బ్బులు తీసుకుంటారు. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉండ‌వు. డ‌బ్బులు వృధా కావ‌డం త‌ప్ప‌.

ఆరోజున ఏం చేయాలి?

సాధార‌ణంగా గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డిన‌ప్పుడు గ్ర‌హ‌ణానికి ముందు ఆ త‌ర్వాత స్నానాలు ఆచ‌రించాలి అంటారు.

గ్ర‌హ‌ణం ఏర్ప‌డిన స‌మ‌యంలో ఏమీ తిన‌కుండా ఉంటే మంచిది.

ఆహార ప‌దార్థాల‌పై ఒక గ‌రిక ఉంచాలి.

గాయ‌త్రి మంత్రం, సూర్య మంత్రాలు చ‌దువుకోవాలి.

గ‌ర్భిణిలు ఇంట్లోనే ఉంటే మంచిది. ఆరు బ‌య‌టికి కూడా రాక‌పోవ‌డం ఉత్త‌మం.

మ‌రీ ముఖ్యంగా.. గ్ర‌హ‌ణం ఏర్ప‌డిందో లేదో అన్న ఉత్సాహంతో సూర్యుడిని నేరుగా క‌ళ్ల‌తో చూసేందుకు మాత్రం ప్ర‌య‌త్నించకండి. క‌ళ్లు పొడిబార‌డాలు.. మంట‌గా అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అంత‌గా చూడాల‌నుకుంటే గాగుల్స్ పెట్టుకుని చూడ‌చ్చు.

రెండో సూర్య గ్ర‌హ‌ణం ఎప్పుడు?

ఇక ఈ 2025లో ఏర్ప‌డ‌బోయే రెండో సూర్య గ్ర‌హ‌ణం విష‌యానికొస్తే.. సెప్టెంబ‌ర్ 21, 22న ఏర్ప‌డ‌బోతోంది. రాత్రి 10:59 నుంచి తెల్ల‌వారుజామున 3:23 వ‌ర‌కు గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంది. ఈ గ్ర‌హణం కూడా మ‌న దేశంలో క‌నిపించ‌దు. న్యూజిల్యాండ్, ఫిజి, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలో క‌నిపించ‌నుంది.

ఇక చంద్ర గ్ర‌హ‌ణం (Lunar Eclipse) గురించి చెప్పాలంటే మార్చి 14న ఏర్ప‌డ‌నుంది. ఇది ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యూర‌ప్, ఆఫ్రికా, అమెరికాలో క‌నిపించ‌నుంది. రెండో చంద్ర‌గ్ర‌హ‌ణం సెప్టెంబ‌ర్ 7న ఏర్ప‌డ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *