US India అమెరికాకు భారత్ కన్నా ఏ దేశమూ ఎక్కువ కాదని అమెరికాకు చెందిన భారత దౌత్యాధికారి సెర్జియో గోర్ తెలిపారు. ఢిల్లీలోని అమెరికన్ దౌత్య కార్యాలయంలో గోర్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య ట్యారిఫ్ల విషయంలో విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చే అవకాశం ఉందని గోర్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న స్నేహం నిజమైనదని.. ఇద్దరు నిజమైన మిత్రుల మధ్య విభేదాలు వచ్చినా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారని అన్నారు. అమెరికా నిర్వహిస్తున్న ప్యాక్స్ సిలికా అలయైన్స్లో భారత్ భాగస్వామ్యం కాబోతోందని ఈరోజు నుంచే ట్రేడ్ డీల్కి సంబంధించిన చర్చలు జరగనున్నట్లు తెలిపారు.