RBI: ఆ ఖాతాల్లోని డ‌బ్బు వెన‌క్కి తీసుకోవ‌డం ఎలా?

RBI: ఒకవేళ మీకున్న బ్యాంక్ ఖాతాల్లో డ‌బ్బులు ఉండ‌టం.. ఆ డ‌బ్బును చాలా కాలం వ‌ర‌కు అంటే దాదాపు ప‌దేళ్ల పాటు వాడ‌కుండా అలాగే ఉంచ‌డం వ‌ల్ల ఎలాంటి యాక్టివిటీ లేనందున కొన్ని సార్లు బ్యాంకులు ఆ ఖాతాల‌ను ఇనాక్టివ్ చేసేస్తుంటాయి. మ‌రి ఆ ఖాతాలు ఇనాక్టివ్ అయిపోతే అందులో ఉన్న డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుందా? రాదా? క‌చ్చితంగా వ‌స్తుంది. ఒక‌వేళ మీకు కూడా ఇలాంటి ఖాతాలు ఉంటే వెంట‌నే ఈ ప్రాసెస్‌ని ఫాలో అయిపోండి.

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా అన్ని బ్యాంకుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ఖాతాదారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఇలాంటి స‌మాచారం ఇస్తూ ఉండాల‌ని చెప్తోంది. ఒక‌వేళ మీకు ఎలాంటి ఖాతాలు ఉన్న‌ప్ప‌టికీ.. అంటే సేవింగ్స్, క‌రెంట్, టర్మ్ డిపాజిట్ ఖాతాల్లోని డ‌బ్బు ప‌దేళ్ల పాటు అలాగే ఉండి ఎలాంటి యాక్టివిటీ లేక‌పోతే ఆ ఖాతాల్లోని డ‌బ్బును రిజ‌ర్వ్ బ్యాంక్ డిపాజిట‌ర్ ఎడుకేష‌న్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లోకి (DEA) ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తుంది. ఈ డ‌బ్బును ఖాతాదారులు వెన‌క్కి తీసుకోవాలంటే UDGAM (unclaimed deposits, gateway to access information) పోర్ట‌ల్‌లోకి వెళ్లాలి.

ఈ పోర్ట‌ల్‌లోకి వెళ్లి మీ లేదా మీ కుటుంబంలో వారి మొబైల్ నెంబ‌ర్‌, PAN కార్డు నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే ఖాతాల్లో డ‌బ్బు ఉందో లేదో తెలుసుకోవ‌చ్చు. ఒక‌వేళ ఏదైనా ఖాతాలో డ‌బ్బు ఉండి ఉంటే.. వెంట‌నే మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి KYC (PAN, Aadhaar, Driving Licence or Passport) డాక్యుమెంట్ల‌ను చూపించాలి. బ్యాంకులు మీ వివ‌రాల‌ను చెక్ చేసి వెంట‌నే ఆ డ‌బ్బును మీకు అందేలా చూస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *