DC vs MI: హార్దిక్ బ్యాట్‌కి చెకింగ్ ఎందుకు?

DC vs MI: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాట్‌ను అంపైర్ మైదానంలోనే చెక్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ఈరోజు ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి కొన్ని నిమిషాల ముందు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన హార్దిక్ పాండ్య‌తో పాటు ఫిల్ సాల్ట్, షిమ్రోన్ హిట్‌మైయ‌ర్‌ల బ్యాట్ల‌ను కూడా అంపైర్ చెక్ చేసాడు.

ఇల్లు ఆకారంలో ఉండే బ్యాట్ గేజ్‌తో ఈ బ్యాట్ల‌ను కొలుస్తారు. BCCI రూల్స్‌కి తగ‌ట్టు బ్యాట్ ఉంటే ఫ‌ర్వాలేదు. అలా లేక‌పోతే వెంట‌నే ఆ బ్యాట్ తీసేసి వేరేది ఇస్తారు. సాధార‌ణంగా ఈ చెకింగ్‌ను డ్రెస్సింగ్ రూంలోనే చేస్తుంటారు. కానీ ఈ ఏడాది BCCI రూల్ మార్చింది. బ్యాట్ల‌ను గ్రౌండ్‌లోనే చెక్ చేయాల‌న్న రూల్ పెట్టింది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. బ్యాట‌ర్లు త‌మ సొంత బ్యాట్ల‌ను తెచ్చుకుని మ్యాచ్ ఆడ‌చ్చు. అందుకే వారి బ్యాట్ల‌ను డ్రెస్సింగ్ రూంలోనే అంపైర్లు కొల‌త‌లు అన్నీ చూసి అనుమ‌తులు ఇస్తుంటారు.

అయితే.. డ్రెస్సింగ్ రూంలో కొలిచిన బ్యాట్ల‌ను కాకుండా కొంద‌రు బ్యాట‌ర్లు వేరే బ్యాట్ల‌ను తీసుకువ‌స్తున్నార‌ని స‌మాచారం అందింద‌ట‌. అందుకే మైదానంలోనే చెకింగ్ చేయాల‌ని BCCI ఆదేశాలు జారీ చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *