Vijayawada Kanaka Durga: అమ్మ‌వారి ప్ర‌సాదంలో వెంట్రుక‌లు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మంత్రి

Vijayawada Kanaka Durga: విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ఇచ్చే ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు రావ‌డంతో భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆల‌య ప్రాంగణంలో ల‌డ్డు తింటుంటే అందులో వెంట్రుక‌లు వ‌చ్చాయంటూ ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేవాదాయ శాఖ మంత్రి అయిన ఆనం రామనారాయ‌ణ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసారు. దీనిపై ఆయ‌న వెంట‌నే స్పందించారు. అసౌక‌ర్యం క‌లిగినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాన‌ని.. అన్ని ఆల‌యాల్లోని ప్ర‌సాదాల త‌యారీలో శుభ్ర‌త అనేది ఉన్న‌త స్థాయిలో ఉండేలా చూస్తాన‌ని అన్నారు. త్వ‌ర‌లో అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించి త‌నిఖీలు నిర్వ‌హించి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *