Search The Query
Search

Image
  • Home
  • Sports
  • Gautam Gambhir: గంభీర్‌ని చంపేంత కోప‌మా?

Gautam Gambhir: గంభీర్‌ని చంపేంత కోప‌మా?

క్రికెట్, సినిమాల విష‌యంలో త‌మ అభిమాన క్రీడాకారులు, న‌టీన‌టుల విష‌యంలో ఫ్యాన్స్ ఎంత దాకైనా వెళ్తార‌ని చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌న మ‌రో నిద‌ర్శ‌నం. ఒక క్రికెటర్ కానీ క్రికెట్ టీం కోచ్ కానీ బాగా ఆడి మ్యాచ్ గెలిపిస్తున్నాడంటే అత‌న్ని దేవుడితో స‌మానంగా చూస్తారు. అప్ప‌టివ‌ర‌కు వీడేం ఆడ‌తాడురా అన్న వాళ్లు కూడా స‌లాం కొడ‌తారు. అదే వారు ఫ్యాన్స్‌కి న‌చ్చ‌ని నిర్ణ‌యాలు తీసుకున్నా.. వారి వ‌ల్ల మ్యాచ్ ఓడిపోయినా వారి ఫోటోల‌కు దండేసేస్తారు. ఇప్పుడు టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) విష‌యంలో ఇదే జ‌రిగింది. గౌత‌మ్ గంభీర్ చ‌నిపోయాడంటూ RIP GAUTAM GAMBHIR అనే హ్యాష్ ట్యాగ్‌ను నెటిజ‌న్లు ట్విట‌ర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతోందంటే.. ట్విట‌ర్ ట్రెండింగ్‌లోనే టాప్‌లో ఉంది. దాంతో చాలా మంది గంభీర్‌కి ఏమైంది అంటూ ఆ ట్రెండ్‌పై క్లిక్ చేస్తున్నారు.

అస‌లేం జ‌రిగింది?

ఇంత‌కీ గంభీర్ గురించి సోష‌ల్ మీడియాలో ఇంత నెగిటివిటీ ఎందుకు వ‌స్తోందంటే.. దానికి కార‌ణం అత‌ను తీసుకున్న ఓ నిర్ణ‌య‌మే. ప్ర‌స్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.  చివ‌రి టెస్ట్ సిడ్నీలో శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది. ఇది టీమిండియాకి చాలా కీల‌కం. కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ స‌మ‌యంలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌కు రెస్ట్ ఇచ్చాడు గంభీర్ (Gautam Gambhir) . ఈ నిర్ణ‌యం క్రికెట్ రంగంలోనే పెద్ద షాకింగ్ అంశంగా మారింది.  గంభీర్ నిర్ణ‌యం వెనుక కార‌ణం రోహిత్ శ‌ర్మ స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డ‌మే. ఇక నుంచి అంతా నేను చెప్పిన‌ట్లే వినాలి అని గంభీర్ టీమిండియాతో అన్నాడ‌ట‌. అందుకే ఈరోజు జ‌రిగిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఎవ‌రెవ‌రు ఆడ‌బోతున్నారు అని వెల్ల‌డించిన గంభీర్.. రోహిత్ పేరు చెప్ప‌లేదు. రోహిత్ బ‌దులు జ‌స్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోనున్న‌ట్లు ప‌రోక్షంగా హింట్ ఇచ్చేసాడు. దాంతో రోహిత్ ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. ఇలాంటి నిర్ణ‌యం తీస‌కున్న‌ గంభీర్ త‌మ దృష్టిలో చ‌నిపోయిన‌ట్లే అని చెప్తూ ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్ గురించి అత‌ని భార్య‌, పిల్ల‌ల గురించి త‌ప్పుడు కామెంట్స్ పెడుతున్నారు.

రోహిత్‌కి ఏమైంది?

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆట తీరును మెరుగుప‌రుచుకుంటూ త‌న సేన‌ను ముందుండి నడిపే రోహిత్‌కి ఏమైంది? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నాలుగు సిరీస్‌ల‌లో రోహిత్ ప్ర‌ద‌ర్శ‌న షాకింగ్‌గా ఉంది. రోహిత్ మూడు సిరీస్‌ల‌లో ఆడ‌గా… ఆ మూడింట్లో క‌లిపి కేవ‌లం 31 ప‌రుగులు తీసాడు. మొద‌టి సిరీస్‌లో రోహిత్ ఆడ‌లేదు. త‌నకు మ‌గ‌బిడ్డ పుట్ట‌డంతో కొంత‌కాలం పాటు కుటుంబంతో గ‌డపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దాంతో ఇక చివ‌రి సిరీస్ శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో గంభీర్ రోహిత్‌ను ప‌క్క‌న పెట్ట‌డం బెట‌ర్ అనుకున్నాడు. ఎందుకంటే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ మ‌న సొంతం కావాలంటే శుక్ర‌వారం జ‌రిగే సిరీస్‌లో మ‌నోళ్లు గెల‌వాల్సిందే. అందుకే గంభీర్ ఎవ‌రెన్ని తిట్టుకుంటున్నా అవ‌మానిస్తున్నా త‌న నిర్ణ‌యాన్ని మాత్రం మార్చుకోలేదు. రోహిత్ స్థానంలో శుభ్‌మ‌న్ గిల్ ఆడే అవ‌కాశం ఉంది.  కేఎల్ రాహుల్, య‌శ‌స్వి జైస్వాల్ రేపు ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయ‌నున్నారు. ఈ ట్రోఫీలో గెలిస్తేనే వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో టీమిండియా ఆడుతుందో లేదో తేలిపోతుంది. ఇక్క‌డ గంభీర్ టీమిండియా ట్రోఫీ గెల‌వాల‌న్న ఉద్దేశంతో రోహిత్‌కి రెస్ట్ ఇచ్చాడు. అంతేకానీ రోహిత్‌పై ద్వేషంతో కాదు. ఈ విష‌యాన్ని అర్థం చేసుకోకుండా రోహిత్ అభిమానులు ఇలాంటి త‌ప్పుడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి త‌ప్పుడు కామెంట్స్ చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో వారే ఆలోచించుకోవాలి. (Gautam Gambhir)

More News

Virat Kohli shows his lookalike to Rohit Sharma
“రో.. వాడెవ‌డో నాలాగే ఉన్నాడు”
BySai KrishnaJan 13, 2026

Virat Kohli న్యూజిల్యాండ్ వ‌ర్సెస్ భార‌త్‌కు మ‌ధ్య జ‌రిగిన తొలి ODI మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. స్టేడియంలో ముందు…

Mohsin Naqvi says play 2026 T20 World Cup in Pakistan
2026 T20 World Cup: అబ్బా చా… ఎవ‌డ‌డిగాడ్రా నిన్ను?
BySai KrishnaJan 12, 2026

2026 T20 World Cup ఏషియా కప్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంటే ఆ ట్రోఫీని ఇవ్వ‌కుండా దొంగ‌లా ప‌ట్టుకుపోయిన వ్య‌క్తి…

Virat Kohli upset about fans cheering during wickets
త‌ప్పు చేస్తున్నారు
BySai KrishnaJan 12, 2026

Virat Kohli ఇష్ట‌మైన బ్యాట‌ర్ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నాడంటే అభిమానుల‌కు కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.…

Jemimah Rodrigues near death experience during childhood
నేను చ‌నిపోయాన‌నుకున్నారు
BySai KrishnaJan 9, 2026

Jemimah Rodrigues మ‌హిళ‌ల క్రికెట్ టీంలో జెమీమా రోద్రీగ్స్ కీల‌క ప్లేయ‌ర్. మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ విజ‌యంలో జెమీమాది సింహ‌భాగం.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top