Operation Sindoor: భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై చేసిన మెరుపు దాడుల గురించి చైనా అక్కసు వెళ్లగక్కింది. పాక్‌కు సపోర్ట్ చేయాలన్న దురుద్దేశంతో భారత్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. పాకిస్థాన్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కాలేదని భారత్‌కి చెందిన ఫైటర్ జెట్‌ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసిందని ప్రచారం చేసింది.
వెంటనే అప్రమత్తమైన చైనాలోని భారత దౌత్యాధికారులు మొట్టికాయలు వేసారు. కనీసం ఇలాంటి కీలక అంశాలపై వార్తలు రాసేటప్పుడు నిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని.. పాక్ భారతీయ ఫైటర్ జెట్‌ను పేల్చివేసింది అనేది పచ్చి అబద్ధమని గడ్డిపెట్టింది. పాపం చైనా పాక్‌కు ఏదో రకంగా సాయం చేయాలనుకుంది. నేరుగా ఏమీ పీకలేక.. ఇలా పాకిస్థాన్ని హీరోగా చూపిస్తూ వార్తలు ప్రచారం చేయడంతో అది కాస్తా బెడిసికొట్టింది.