Donald Trump: బైడెన్‌ను ఉరి తీసారు.. ట్రంప్ పిచ్చి వాగుడు

Donald Trump: రాజ‌కీయాల్లో అన్ని పార్టీల వారు ఒక‌రిపై ఒక‌రు ప‌ర‌స్ప‌ర దాడులు చేసుకోవ‌డం.. నోటికొచ్చిన‌ట్లు తిట్టకోవడం స‌ర్వ‌సాధార‌ణం. ఇది మ‌న భార‌త‌దేశ రాజ‌కీయాల్లో విప‌రీతంగా ఉంటుంది అనుకుంటాం కానీ.. అగ్ర రాజ్యం అమెరికాలో హేట్ పాలిటిక్స్ పీక్స్‌లో ఉంది అన‌డానికి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం.

ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకున్న ట్రంప్ అనుకున్న‌ట్లుగానే రెండోసారి అమెరికా అధ్య‌క్షుడైపోయారు. అనుకున్న విజ‌యం సాధించేసారు. ఇక ఆయ‌న అమెరికాలో ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి పాల‌న సాగించాలే కానీ.. మాజీ అధ్య‌క్షుడి ప‌ట్ల క‌క్ష పెంచేసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్న వైనం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ప్ర‌త్య‌ర్ధిపై ద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌డంలో త‌ప్పు లేదు. అది అందరు రాజ‌కీయ నాయ‌కులు చేసే ప‌నే. కాక‌పోతే ఆ మాట తీరు కాస్త అదుపులో ఉంటే అధ్య‌క్షుడిగా ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్కుతుంది.

అస‌లేం జ‌రిగింది?

మాజీ అధ్య‌క్షుడు జో బైడెన్ ఆరోగ్యం అస్స‌లు బాలేదు. ఆయ‌న అధ్య‌క్షుడిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న స‌మ‌యంలోనే మ‌తిమ‌రుపుతో ప‌లుమార్లు ఆయ‌న ఇబ్బందిప‌డ్డారు. ఇప్పుడు ఆయ‌న‌ ప్రోస్టేట్ క్యాన్స‌ర్ బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఒక వ్య‌క్తి మ‌ర‌ణం గురించి మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం చెప్పండి? ఆ బుద్ధి ట్రంప్‌కి లేన‌ట్లుంది. బైడెన్‌ను ప‌ట్టుకుని.. అస‌లు బైడెన్ అనే వ్య‌క్తే లేడ‌ని.. చాలా సంవ‌త్స‌రాల క్రితం అత‌న్ని ఉరి తీసార‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. మ‌రి ఇప్పుడ మ‌న క‌ళ్లెదుట ఉన్న బైడెన్ ఎవ‌రు సార్ అని వైట్ హౌస్ మీడియా వ‌ర్గాలు అడ‌గ్గా.. అది కేవ‌లం ప్రాణం లేని రోబో అని అమ‌ర్యాద‌క‌రంగా బ‌దులివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బాడీ డ‌బుల్ నిజ‌మేనా?

అస‌లు ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డానికి ఓ కార‌ణం ఉంది. అమెరికాలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు కనిపిస్తున్న చాలా మంది సెల‌బ్రిటీలు అస‌లైన వారు కాద‌ని.. వారు బాడీ డ‌బుల్స్‌ని ఉప‌యోగిస్తున్నార‌ని ఓ టాక్ న‌డుస్తోంది. ఈ ఆరోప‌ణ ట్రంప్‌పై కూడా వ‌చ్చింది. ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా కూడా బాడీ డ‌బుల్ వాడుతోంద‌న్న ఆరోప‌ణ ఉంది. దాంతో ట్రంప్‌కి ఒళ్లు మండి బైడెన్‌ను 2020లోనే ఉరి తీసార‌ని.. ఇప్పుడు బ‌య‌టికి క‌నిపిస్తున్న బైడెన్ ఓ రోబో అని అంటున్నారు.

దీనికి ట్రంప్ స‌పోర్ట‌ర్లు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ట్రంప్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అబద్ధం అని నిరూపించే ప‌నిలో ప‌డ్డారు. అమెరికా అధ్య‌క్షుడు అయిన‌ప్పుడు బైడెన్ ఉన్న ఫోటోల‌కు ఇప్పుడు ఉన్న బైడెన్‌కు చాలా తేడా ఉంద‌ని.. ఆయ‌న చెవి ఆకారం, క‌ళ్ల రంగు మారిందంటూ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాడీ డ‌బుల్స్ ఉంటారు కానీ వారిని సినిమాల్లో చూస్తామే త‌ప్ప నిజ జీవితంలో కాదు. బాడీ డ‌బుల్స్ అంటే 50% ఫ‌లానా వ్య‌క్తిలాగే క‌నిపిస్తారే త‌ప్ప 100% క‌నిపించ‌రు. అస‌లు అమెరికాలో ఉన్న‌ట్టుండి ఈ బాడీ డ‌బుల్ అనే టాపిక్ ఎందుకు వైర‌ల్ అవుతోందో ఏమో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *