Tilak: తిల‌కం పెట్టుకునేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేస్తున్నారా?

Tilak: చాలా మందికి తిల‌కం పెట్టుకునే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు రోజూ పెట్టుకుంటూ ఉంటారు. మ‌రికొందరు పండ‌గ‌లు, ప్ర‌త్యేక పూజ‌లు, దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. అయితే తిల‌కం కానీ బొట్టు కానీ పెట్టుకునే క్ర‌మంలో కొన్ని ప‌ద్ధ‌తులు పాటించాల్సి ఉంటుంది. 

తిల‌కం కానీ బొట్టు కానీ స్నానం చేసిన త‌ర్వాతే పెట్టుకోవాలి.

మ‌నం తిల‌కం పెట్టుకుంటున్న‌ట్లైతే ఉంగ‌రం వేలితో పెట్టుకోవాలి.

ఉద‌యాన్నే కానీ లేదా ఏద‌న్నా మంచి ప‌నికి ముందు కానీ తిల‌కం పెట్టుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది అంటారు.

తిల‌కం పెట్టుకునేట‌ప్పుడు కోపంగా, చిరాగ్గా ఉండ‌కూడ‌దు. ప్ర‌శాంతంగా ఉండాలి.

ఎక్క‌డ‌ప‌డితే అక్కడ తిల‌కాలు, బొట్లు పెట్టేసుకోకూడ‌దు. ఆల‌యాల్లో, మ‌న ఇంట్లో, లేదా శుభ్ర‌మైన ప్ర‌దేశాల్లో మాత్ర‌మే పెట్టుకోవాలి.

చంద‌నంతో తిల‌కం పెట్టుకుంటే నుదురు చ‌ల్ల‌గా, ప్ర‌శాంతంగా ఉండేలా చేస్తుంది.

కుంకుమ తిల‌కం ప‌వ‌ర్, ఎన‌ర్జీ ఇస్తుంది.

విభూతి త్యాగానికి ప్ర‌తీక అంటారు.

కుంకుమ పువ్వుతో చేసిన తిలకం అభివృద్ధినిస్తుంది.

తిల‌కం నిండుగా, నిటారుగా ఉండాలి. అడ్డంగా పెట్టుకున్నా నిటారుగా పెట్టుకున్నా చక్క‌గా ఉండాలి. ఎలా ప‌డితే అలా పెట్టేసుకోకూడ‌దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *