Delhi: భారతదేశంలో అత్యంత కాలుష్యభరితమైన నగరం ఏది అంటే ఠక్కున మన రాజధాని ఢిల్లీ గుర్తొస్తుంది. కానీ ఢిల్లీని మించిన కాలుష్యంతో అల్లాడిపోతున్న నగరం ఏదో తెలుసా? ఒడిశాలోని టాల్చెర్ నగరం. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 324 ఉండగా.. టాల్చెర్లో మాత్రం 355 ఉంది. ఇందుకు కారణం అక్కడ వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం కంటే పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొల్యూషనే ఎక్కువ.