temples to visit based on birthdate: పుట్టిన తేదీని బ‌ట్టి ద‌ర్శించుకోవాల్సిన ఆల‌యాలు

temples to visit based on birthdate: మ‌నం సాధార‌ణంగా ప్ర‌తి పుట్టిన‌రోజుకి ఏదో ఒక ఆల‌యానికి వెళ్తుంటాం. ఇది స‌ర్వ‌సాధార‌ణం. కానీ మనం పుట్టిన తేదీ వ్యక్తిత్వం, అదృష్టం మాత్రమే కాదు.. ఆధ్యాత్మికంగా ఏ దేవాలయం దర్శిస్తే శుభం కలుగుతుందో కూడా సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి జన్మతేదీకి కొన్ని ప్రత్యేక శక్తులు, గ్రహ ప్రభావాలు ఉంటాయి. వాటిని సమతుల్యం చేయడానికి కొన్ని దేవాలయాలు దర్శించడం ఎంతో మంగళకరం అని నమ్మకం. మీ పుట్టిన తేదీ ఆధారంగా మీరు ఏ ఆలయానికి వెళ్లాలి? ఏ దేవుడి దర్శనం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది? వంటి అంశాల‌ను తెలుసుకుందాం.

చాముండా దేవి ఆల‌యం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌

ఏ నెల‌లో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు త‌ప్ప‌క దర్శించుకోవాల్సిన ఆల‌యం ఇది. ఈ తేదీల‌కు అధిప‌తి సూర్యుడు. సూర్య భ‌గ‌వానుడి ఆశీస్సులు, చాముండా దేవి అమ్మ‌వారి శ‌క్తి రెండూ పొందాలంటే క‌చ్చితంగా ఒక్క‌సారైనా ద‌ర్శించుకుని రావాల్సిందే.

రామేశ్వ‌రం, త‌మిళ‌నాడు

2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన‌వారు ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాల‌ట‌. ఈ తేదీల‌పై చంద్రుడి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. భార‌త‌దేశంలోని చార్‌ధామ్ ఆల‌యాల్లో ఇదీ ఒకటి కాబ‌ట్టి.. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన‌వారు ఈ ఆల‌యంతో మ‌రింత క‌నెక్ట్ అవుతారు. ముఖ్యంగా 2 వ తేదీన పుట్టిన‌వారికి ఈ ఆల‌యం అత్యంత శుభ‌దాయ‌కం.

సోమనాథ్ ఆల‌యం, గుజ‌రాత్

3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన‌వారు త‌ప్ప‌క ద‌ర్శించుకోవాల్సిన ఆల‌యం ఇది. ఈ తేదీల్లో పుట్టిన‌వారు చార్‌ధామ్ ఆల‌యాల్లో ఒక‌టైన ఈ సోమ‌నాథ్ ఆల‌య ఎన‌ర్జీకి మ‌రింత క‌నెక్ట్ అవుతారు.

తిరుమ‌ల‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆ క‌లియుగ దైవాన్ని దాదాపు అంద‌రూ ద‌ర్శించుకునే ఉంటార‌నుకోండి. కాక‌పోతే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన‌వారు త‌ప్ప‌నిస‌రిగా ద‌ర్శ‌నం చేసుకోవాల్సిందే.

సిద్ధివినాయ‌క ఆల‌యం, మ‌హారాష్ట్ర‌

5, 14, 23 తేదీల్లో పుట్టిన‌వారు ఈ లాల్ బాగ్జా రాజాగా పిలువ‌బ‌డే బొజ్జ గ‌ణ‌పయ్య‌ను ద‌ర్శించుకుంటే ఎంతో మంచిది. 5వ సంఖ్య గ‌ణ‌నాథుడికి ఎంతో ఇష్టం. జ్ఞానం, విద్య‌, క్లారిటీ, విజ‌యం, జీవితంలో కొత్త ప్రారంభాలు.. ఇవ‌న్నీ ప్ర‌సాదించేది ఆయ‌నే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *