Asha Bhosle: అందుకే మేం తెలుపే వేసుకుంటాం

Asha Bhosle: ప్ర‌సిద్ధ గాయ‌నిలు ఆశా భోంస్లే, ల‌తా మంగేష్క‌ర్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వారి గాత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అయితే.. ఇప్పుడు ల‌తా మంగేష్క‌ర్ మ‌న మ‌ధ్య లేరు. 2022లోనే ల‌తా మంగేష్క‌ర్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చ‌నిపోయారు. అయితే.. ఆశా భోంస్లే, ల‌తా మంగేష్క‌ర్‌ల పేర్లు విన‌గానే మ‌నకు గుర్తొచ్చేది వారు వేసుకునే తెల్ల డ్రెస్సులు. ఇద్ద‌రూ ఎప్పుడూ తెల్ల చీర‌లు లేదా చుడీదార్‌లే వేసుకుని బ‌య‌టికి వ‌చ్చేవారు. అలా ఎందుకు వేసుకునేవారో తాజాగా ఓ సంద‌ర్భంలో ఆశా భోంస్లే వెల్ల‌డించారు. త‌మ శ‌రీర ఛాయ‌కు తెలుపు రంగే నప్పేద‌ట. వేరే రంగుల దుస్తులు వేసుకుంటే తాము న‌ల్ల‌గా క‌నిపించేవార‌ట‌. ఆ త‌ర్వాత తాను మాత్రం పింక్, పింక్‌తో పాటు ఇత‌ర రంగులు క‌లిసున్న దుస్తులు వేసుకునేదాన్న‌ని.. కానీ ల‌త మాత్రం ఎప్పుడూ తెలుగు రంగు దుస్తులే వేసుకునేందుకు ఇష్ట‌ప‌డ్డార‌ని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *