Anaswara Rajan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటుడని తెలుసు కానీ తెలుగు నటుడు అని తెలీదని అన్నారు ఛాంపియన్ హీరోయిన్ అనస్వరా రాజన్. రోషన్ మేక హీరోగా నటించిన ఈ ఛాంపియన్ సినిమాలో అనస్వర జోడీగా నటించారు. ఈ సందర్భంగా ఆమె అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలు చిన్నప్పటి నుంచి మలయాళ భాషలోనే చూస్తున్నానని.. ఆయన మలయాళ నటుడనే అనుకున్నానని తెలిపారు. ఆయన తెలుగు నటుడు అని ఈ మధ్యకాలంలోనే తెలిసి షాకయ్యానని అన్నారు.