Allu Arjun Atlee: బ‌న్నీ సినిమాలో.. ఒక్క హిట్ లేని హీరోయిన్?

Allu Arjun Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బ‌న్నీ.. ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని అట్లీ కాంబోలో సినిమా అంటే చాలా మందికి హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇందులో హీరోయిన్ కూడా ఆ రేంజ్‌కి త‌గ్గ‌ట్టే ఉండాలి. అయితే.. ప్యాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి అట్లీ ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నారు. అందుకే ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో ఒక్క హిట్ లేని అన‌న్య పాండేను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అన‌న్య లైగ‌ర్ సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయ్యింది.

ఈ సినిమా ఏ రేంజ్‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అన‌న్య యాక్టింగ్ విష‌యంలో బాలీవుడ్‌లో కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. కేవ‌లం తండ్రి పేరు చెప్పుకుని వ‌రుస‌గా సినిమాలు ద‌క్కించుకుంటోంది అని అక్క‌డి నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు అన‌న్య న‌టించిన ఏ సినిమా కూడా యావ‌రేజ్ టాక్‌ని కూడా అందుకోలేదు. అన‌న్య న‌టించిన కాల్ మి బేయ్ అనే వెబ్ సిరీస్‌కి మాత్రం కాస్త గుర్తింపు వ‌చ్చింది. అది కూడా న‌టి స‌మంత ఈ వెబ్ సిరీస్ చాలా న‌చ్చింది అని కామెంట్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు తెలిసింది. అలాంటి అన‌న్య‌ను బ‌న్నీ సినిమాలో హీరోయిన్‌గా అనుకుంటున్నారంటే సాహ‌స‌మ‌నే చెప్పాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *