ఈ న‌క్ష‌త్రంలో పుట్టిన‌వారికి అఖండ రాజ‌యోగం

Astrology మ‌ఖ న‌క్ష‌త్రం వారికి 2026లో తొలి స‌గ భాగం అంతా అదృష్టం, విప‌రీత‌మైన రాజ‌యోగం, ధ‌న‌యోగం క‌లిగే సూచ‌న‌లు కనిపిస్తున్నాయ‌ని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే.. ప్ర‌థానమైన నాలుగు గ్ర‌హాలు గురు, శ‌ని, రాహు, కేతువుల ప్ర‌భావం బాగా ఉంది. జూన్ 1 వ‌ర‌కు గురువు లాభ స్థానంలో ఉంటాడు.

దీని వ‌ల్ల అఖండ‌మైన సంప‌ద‌లు క‌ల‌గ‌డం, ఆర్థిక అభివృద్ధి బాగుండ‌డం, గౌర‌వ మ‌ర్యాదలు ద‌క్క‌డం వంటివి ఉంటాయి. అయితే.. జూన్ 1 నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు గురు బ‌లం త‌గ్గిపోతుంది. జూన్ 1 నుంచి వ‌ర‌కు ఖ‌ర్చులు విప‌రీతంగా ఉంటాయి. రూపాయి సంపాదిస్తే ప‌ది రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయి. శుభ‌కార్యాలకు ఖ‌ర్చులు పెడ‌తారు. వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితులు ఉన్నాయి. వృత్తిలో చికాకులు, అగౌర‌వాలు కూడా ఉంటాయి. అప్పులు కూడా పెరుగుతాయి. కాబ‌ట్టి ఏవ‌న్నా కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌నుకుంటే మాత్రం జూన్‌కి ముందు వ‌ర‌కే అన్నీ చేసుకోండి. జూన్ వ‌ర‌కు డ‌బ్బు సేవింగ్ చేసుకోండి. దీని వ‌ల్ల అకాల ఖ‌ర్చులు, అప్పుల నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంటుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *