25 ప‌రుగుల దూర‌మే

Virat Kohli: గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తొలి ODIలో విరాట్ కోహ్లీ ఆడ‌నున్నాడు. ఈ మ్యాచ్ న్యూజిల్యాండ్‌తో జ‌ర‌గ‌నుంది. క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రో రికార్డు నెల‌కొల్ప‌డానికి విరాట్‌కి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. 25 ప‌రుగులు.. కేవ‌లం 25 ప‌రుగుల‌తో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ తెందుల్క‌ర్ రికార్డును విరాట్ బ్రేక్ చేయ‌గ‌ల‌డు. ఆ రికార్డు బ్రేకింగ్ ఈవెంట్ ఈ ODIలో జ‌ర‌గాల‌ని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇంత‌కీ ఈ 25 ప‌రుగులు దేనికి అంటే.. 28000 అంత‌ర్జాతీయ ప‌రుగులు పూర్తి చేయ‌డానికి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ 28 వేల ప‌రుగుల‌ను స‌చిన్ తెందుల్క‌ర్ 644 ఇన్సింగ్స్‌లో పూర్తిచేయ‌గా.. కుమార్ సంగ‌క్క‌ర 666 ఇన్నింగ్స్‌లో పూర్తి చేసారు. కానీ కోహ్లీ మాత్రం 623 ఇన్సింగ్స్‌లోనే పూర్తి చేస్తే చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *