Ambati Rambabu: మేమేం పీకలేకపోయారు.. పోనీ మీరు పీకండి.. మేం పీకించుకోడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు. ఓ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లు విదేశాల్లో నుంచి కొందరు.. సోషల్ మీడియాలో కూర్చుని కొందరు మాట్లాడితే మేం అధికారంలోకి వచ్చాక చెప్తాం అంటూ బెదిరిస్తున్నారని.. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేపోయారు. ఇక ఇప్పుడేంటి మీరు చెప్పేది అని వ్యాఖ్యానించారు. దీనిపై అంబటి స్పందిస్తూ.. మేమేం పీకలేకపోయారు.. పోనీ మీరు పీకండి.. మేం పీకించుకోడానికి సిద్ధంగా ఉన్నాం అని ట్వీట్ చేసారు.