Sheikh Hasina: నవంబర్ 17.. ఈ తేదీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇదే రోజున 1967లో ఆమెకు వివాహం జరిగింది. MA వాజిద్ మియా అనే పేరుగాంచిన ఫిజిసిస్ట్ని హసీనా పెళ్లాడారు. 2009లో బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లోనే వాజిద్ మియా చనిపోయారు.
అలాంటిది.. ఆమె పెళ్లి రోజే మరణశిక్ష పడటం చర్చనీయాంశంగా మారింది. మరికొందరేమో కావాలనే బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యూనల్ (ICT) నవంబర్ 17వ తారీఖునే మరణ శిక్ష పడేలా తీర్పు ఇవ్వాలని నిర్ణయించిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ICT తొలుత నవంబర్ 13న తీర్పు ఇవ్వాలని నిర్ణయించిందట. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల నవంబర్ 17కి మార్చినట్లు తెలుస్తోంది.
ఆమె పెళ్లి రోజునే తీర్పు వెల్లడించి మానసికంగా క్షోభ పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్న మహ్మద్ యూనస్ పట్టుబట్టి మరీ ఈ తేదీని నిర్ణయించినట్లు సమాచారం. ఎందుకంటే తన రాజకీయ కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తోంది యూనసే అని ఎప్పటినుంచో హసీనా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడు హసీనా బంగ్లాదేశ్‌కు వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఆమెకు బుద్ధి చెప్దామా అని యూనస్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.





