Kamal Haasan: తమిళనాడులో మక్కళ్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. త్వరలో రాజ్యసభలో సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు. ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్న పార్టీల ముందు నిలబడలేక ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కమల్.. లోక్ సభలో పోటీ చేస్తారా? లేక రాజ్యసభ సభ్యుడిగా ఉంటారా అని డీఎంకే ఇచ్చిన ఆఫర్‌లో రాజ్యసభకు ఓటేసారు. జూన్ 19న తమిళనాడు, అస్సాంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు సీట్లు తమిళనాడు నుంచి కాగా.. రెండు సీట్లు అస్సాం నుంచి ఉన్నాయి.