Donald Trump: రియాల్టీ షోలో పాల్గొంటే పౌర‌స‌త్వం

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత పౌర‌స‌త్వ పాల‌సీలు, ఇమ్మిగ్రేష‌న్ పాల‌సీపై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంతో మంది ఇల్లీగ‌ల్ ఇమ్మిగ్రెంట్ల‌ను త‌మ స్వ‌దేశాల‌కు పంపించేసారు. అయితే.. అమెరికాలో ఉంటున్న‌ప్ప‌టికీ అస‌లు పౌర‌స‌త్వం రాని ఇమ్మిగ్రెంట్లు చాలా మందే ఉన్నారు. వారికి పౌర‌స‌త్వం వ‌స్తుందా రాదా కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే ట్రంప్ పాల‌సీలు అంత క‌ఠినంగా ఉన్నాయి మ‌రి.

ఈ నేప‌థ్యంలో యూఎస్ డిపార్ట్‌హెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఒక క్రేజీ నిర్ణ‌యం తీసుకుంది. రియాల్టీ షో పెట్టి అందులో గెలిచిన వారికి అమెరిక‌న్ పౌర‌సత్వం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. ఈ ప్లాన్ ఇంకా చ‌ర్చ‌ల స్టేజ్‌లోనే ఉంది. అయితే రియాల్టీ షోలో ఓడిపోయిన వారిని మాత్రం అమెరికా నుంచి పంపించేయ‌డాలు లాంటివి ఉండ‌వు. ఈ రియాల్టీ షోలో గోల్డ్ ర‌ష్ మైనింగ్, మోడ‌ల్ T కారు చాసిస్‌ను అసెంబుల్ చేయ‌డం వంటి టీమ్ టాస్క్‌లు ఉంటాయ‌ట‌. ఒక్కో ఎపిసోడ్ కొన్ని గంట‌ల పాటు ఉంటుంది. అంతా ఓకే అయితే.. ఈ షోను ఎల్లిస్ ఐల్యాండ్‌లో షూట్ చేస్తారు.

ఎల్లిస్ ఐల్యాండ్ అమెరికాకు ప్ర‌ధాన ఇమ్మిగ్రేష‌న్ పాయింట్. ప్ర‌తి ఎపిసోడ్‌కి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. గెలిచిన‌వారికి అమెరిక‌న్ పౌర‌స‌త్వం ల‌భిస్తుంది. అయితే.. ఇందులో పాల్గొనేవారు దీనిని కేవ‌లం ఒక కాంపిటీష‌న్‌గా మాత్ర‌మే ప‌రిగ‌ణించాల‌ని.. అంతేకానీ క్రూర‌మైన ఆలోచ‌న‌లు, ఇత‌రుల‌ను ఎలాగైనా మోసం చేసి ఓడించాల‌న్న క‌ప‌ట బుద్ధి ఉంటే మాత్రం ఎలిమినేట్ చేసేస్తామ‌ని అంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *