JR NTR: రిట‌ర్న్ గిఫ్ట్‌కి రెడీగా ఉండండి

JR NTR: నేను ఇవ్వ‌బోయే రిట‌ర్న్ గిఫ్ట్‌కి రెడీగా ఉండండి క‌బీర్ స‌ర్ అంటూ తార‌క్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ కాంబినేష‌న్‌లో వార్ 2 సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మే 20న తార‌క్ పుట్టిన రోజు. ఈ నేప‌థ్యంలో హృతిక్ రోష‌న్ వార్ 2కి సంబంధించి ఓ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతోంది అంటూ తార‌క్‌ను మెన్ష‌న్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. హే ఎన్టీఆర్.. మే 20న ఏం రాబోతోందో నీకు తెలుసు అనుకుంటున్నావా? క‌చ్చితంగా నీకు తెలిసి ఉండ‌దు అని పేర్కొన్నారు.

ఆ పోస్ట్‌కి తార‌క్ రిప్లై ఇస్తూ.. ధ‌న్య‌వాదాలు హృతిక్ స‌ర్. మీకు స్పెష‌ల్ రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌డానికి నేను కూడా చాలా ఎదురుచూస్తున్నా క‌బీర్ అంటూ వార్ 2లో హృతిక్ క్యారెక్ట‌ర్ పేరుని రివీల్ చేసారు. ఇక‌పోతే.. తారక్ బ‌ర్త్‌డే రోజు వార్ 2 టీజ‌ర్ రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌న్న టాక్ న‌డుస్తోంది. టీజ‌ర్ కాక‌పోయినా క‌నీసం మాస్ ఫ‌స్ట్ లుక్ అన్నా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఖుష్ అవుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయ‌ర్ కూడా తార‌క్ బ‌ర్త్‌డే రోజు హృతిక్‌, తార‌క్ క‌లిసి ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టారే త‌ప్ప సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వ‌లేదు. క‌నీసం ఇప్పుడైనా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ఫ్యాన్స్‌ని ఖుష్ చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *