POK: లాడెన్ క‌ల నెర‌వేర్చాల‌ని

POK: ఆసిమ్ మునీర్.. ఉగ్ర‌వాదుల కంటే డేంజ‌ర్ వీడు. పేరుకి మాత్ర‌మే పాకిస్థాన్ ఆర్మీ జ‌న‌ర‌ల్. చేసేవ‌న్నీ గుడిసెట్టి ప‌నులే. ఓ ర‌కంగా చెప్పాలంటే ముందు ప‌గలాల్సింది ఉగ్ర‌మూక‌ల‌కు కాదు. ఆసిమ్ మునీర్‌కి. జ‌మ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాం దాడి జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆసిమ్ మునీర్ కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్య‌లే. కాశ్మీర్ పాకిస్థాన్ సొంతం అని.. ఇప్పుడు కాక‌పోయినా భ‌విష్య‌త్తులో అయినా కాశ్మీర్‌ను చేజిక్కించుకోవాల‌ని వాగాడు.

ఇంత‌టితో ఆగ‌లేదు హిందువులు, ముస్లింలు వేరు రేప‌టి పాకిస్థానీ పౌరులు ఈ వ్యాఖ్య‌ల‌ను క‌చ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటూ కావాల‌నే మ‌త రాజ‌కీయాల‌కు తావిచ్చాడు. ఆసిమ్ ఈ వ్యాఖ్య‌లు చేసిన కొన్ని రోజుల‌కే ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌మూక‌లు రెచ్చిపోయి 26 మంది భార‌తీయుల‌ను క‌డుపున పెట్టుకున్నారు. దానికి ధీటుగా మ‌నం ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టాం. 

బిన్ లాడెన్ క‌ల నెర‌వేర్చేలా

ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్‌కు ఓ లింక్ ఉంది. 9/11 దాడి జ‌ర‌గడానికి ముందు బిన్ లాడెన్ కూడా 1999లో కాశ్మీర్ గురించి ఇలాంటి కూత‌లే కూసాడు. పాకిస్థాన్‌కు భార‌త్, అమెరికా అతిపెద్ద శ‌త్రువులు అని వ్యాఖ్యానించాడు. కాశ్మీర్ మొత్తం పాక్ చేతికి చిక్కాలంటే అక్క‌డున్న మిలిటెంట్ల‌కు సాయం చేయాల్సిందే అని పాక్‌కి చెందిన ముజాహిద్దీన్ సంస్థ‌కు పిలుపునిచ్చాడు. 1999 కార్గిల్ యుద్ధం స‌మ‌యంలో పాకిస్థాన్‌కు బిన్ లాడెన్ మ‌నుషులు సాయం చేసారు. 

పాక్ ఆర్మీలో బిన్ లాడెన్ మ‌నుషులు

పాకిస్థాన్ అమాయ‌క‌మైన దేశం.. ఉగ్ర‌వాదుల వ‌ల్ల పాక్ న‌లిగిపోతోంది అంటూ పిచ్చి కూత‌లు కూసే పాకిస్థానే స్వ‌యంగా తామే ఉగ్ర‌వాదుల‌ను మేపుతూ భార‌త్‌పైకి వ‌దులుతున్నామ‌ని అంత‌ర్జాతీయ మీడియా ముందుకు ఒప్పుకుంది. ఇప్ప‌టికీ పాకిస్థాన్ ఆర్మీలో బిన్ లాడెన్ మ‌నుషులు ఉన్నారు. పాక్ ఆర్మీకి చెందిన ఓ పెద్ద ర్యాంక్ ఆఫీస‌ర్ బిన్ లాడెన్ నెట్‌వ‌ర్క్‌తో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అత‌ని పేరు లెఫ్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్ అహ్మ‌ద్ షెరీఫ్ చౌద‌రి. యూఎన్ లిస్ట్‌లో ఉన్న‌ ఉగ్ర‌వాదుల్లో ఒక‌రైన మ‌హ్మూద్ సుల్తాన్ బ‌షీరుద్దీన్ కొడుకే ఈ అహ్మ‌ద్. నూక్లియ‌ర్ సీక్రెట‌న్నీ బిన్ లాడెన్‌కు చేర‌వేసింది బ‌షీరుద్దీనే అని తెలిసి యూఎన్ ఇత‌న్ని మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *