Turkey: టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ టర్కీ పాక్‌కు సాయం చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ టర్కీ వస్తువులను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో టర్కీలో భూకంపం రావడంతో కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో టర్కీలో భారీ భూకంపం వచ్చి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగితే భారత్ చాలా వరకు సాయం చేసింది. ఆ కృతజ్ఞతా భావం లేకుండా భారత్‌పై ఉగ్రమూకలను ఉసిగొల్పే పాక్‌కు సాయం చేయడం వివాదాస్పదంగా మారింది. మరి ఈరోజు ఏర్పడిన భూకంపం ధాటికి ఏదన్నా ఆస్తి, ప్రాణ నష్టం జరిగితే ఈసారి మాత్రం భారత్ జాలి, దయ చూపకుండా ఉంటే అప్పుడన్నా టర్కీకి మన విలువ తెలిసొస్తుందో లేదో చూడాలి.