Renu Desai: చైనా వ‌స్తువులు కొనకండి

Renu Desai: న‌టి రేణూ దేశాయ్ నెటిజ‌న్ల‌కు ఒక అభ్య‌ర్ధ‌న చేసారు. చైనా వ‌స్తువులు వీలైనంత వ‌ర‌కు ఎవ్వ‌రూ కొన‌కుండా ఉండేందుకే ప్ర‌య‌త్నించండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

“” మీకు మ‌న దేశం ప‌ట్ల నిజ‌మైన గౌర‌వం ఉంటే ముందు ఆ చైనా వ‌స్తువులు కొన‌డం మానండి. మీరు షాపింగ్‌కి వెళ్లేట‌ప్పుడు న‌చ్చిన‌వన్నీ చూసుకోకుండా కొనేయ‌క‌.. ఒక్క‌సారి ఆ వ‌స్తువు వెన‌క్కి తిప్పి అది ఎక్క‌డ త‌యారైందో చూసి అప్పుడు కొనుగోలు చేయండి. వీలైనంత వ‌ర‌కు షాపింగ్ మాల్స్, సూప‌ర్ మార్కెట్ల‌లో ప‌నిచేసే వారికి కూడా చైనా వ‌స్తువులు అమ్మితే కొన‌ము అని తెలియ‌జేయండి. నేను కూడా ఎన్నో చైనా వ‌స్తువులు కొన్నాను. కానీ అది ఒక‌ప్పుడు. ఇక నుంచి నా ఇంటికి వ‌చ్చే వ‌స్తువుల్లో వీలైనంత వ‌ర‌కు చైనా వ‌స్తువులు లేకుండా ఉండేలా చూస్తాను. ఇది పెద్ద ప్రాసెస్‌. కానీ ఎప్పుడో ఒక‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు మొద‌లుపెట్టాల్సిందే. ఇక‌నైనా మ‌న భార‌తీయ వ‌స్తువుల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ దేశం ప‌ట్ల మ‌న‌కున్న భ‌క్తిని చాటుకుందాం. జై హింద్ “” అని పేర్కొన్నారు.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్ పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావ‌రాల‌పై ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట మెరుపు దాడులు చేసిన నేప‌థ్యంలో పాకిస్థాన్‌కు ట‌ర్కీ బాస‌ట‌గా నిలిచింది. భూకంపం వ‌చ్చిన‌ప్పుడు భార‌త్ సాయం పొందిన ట‌ర్కీ వ‌క్ర‌బుద్ధిని చూపించింది. భార‌త్‌కు పాక్ హాని చేస్తోందని తెలిసీ ఆయుధాలు అందించింది. దాంతో భార‌త్‌లో ట‌ర్కీకి సంబంధించిన వ‌స్తువుల‌ను బ్యాన్ చేసారు. వ్యాపారులు త‌మకు న‌ష్టం వ‌చ్చినా ఫ‌ర్వాలేదు కానీ ట‌ర్కీకి సంబంధించిన వ‌స్తువుల‌ను మాత్రం దిగుమ‌తి చేసుకునేదే లేద‌ని భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. చైనా కూడా ఓ ర‌కంగా పాక్‌కు మ‌ద్ద‌తుదారే. మ‌న దేశంలో అత్య‌ధికంగా అమ్ముడుపోయే వ‌స్తువుల్లో చైనావే ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో రేణూ ఇత‌ర దేశాల వ‌స్తువులు వ‌ద్దు భార‌త్‌లో త‌యారైన వ‌స్తువులే మ‌ద్దు అంటూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *