Pakistan: భారత్‌తో యుద్ధంలో మేమే గెలిచాం అంటూ ఫేక్ ప్రచారాలతో చంకలు గుద్దుకుంటున్న పాకిస్థాన్ మరోసాని కాళ్ల బేరానికి వచ్చింది. ఇండస్ వాటర్ ట్రీటీ (సింధూ జలాలు) విషయంలో మరోసారి ఆలోచించి తమకు నీళ్లు వదిలేలా చేయాలని భారత్‌ను కోరింది. ప్రస్తుతానికి ఇరు దేశాలు కాల్పులు విరమించుకున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం సింధు నది జలాల విషయంలో మాత్రం ఒప్పందం రద్దును ఇంకొన్ని రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రిత్వ శాఖ భారత్‌కు లేఖ రాస్తూ దయచేసి మరోసారి ఆలోచించాలని కోరింది. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.