Congress: ఆప‌రేష‌న్ సింధూర్ ఎక్క‌డ విజ‌య‌వంత‌మైంది?

Congress: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకార చ‌ర్య‌గా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌ర్ సింధూర్ ఎక్క‌డ విజ‌య‌వంత‌మైంద‌ని ప్ర‌శ్నించారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత భూపేష్ భ‌గేల్. ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టింది కేవ‌లం ఉగ్ర‌వాదుల‌ను చంపేందుకే కాద‌ని.. ప‌హల్గాంలో భార‌తీయుల‌పై దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌ను చంప‌డానికి కూడా అని ఆయ‌న అన్నారు.

ప‌హ‌ల్గాం నిందితుల‌ను చంప‌కుండా పాక్‌లో న‌క్కి ఉన్న ఇత‌ర ఉగ్ర‌మూక‌ల‌ను మ‌ట్టుబెట్టేసి ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌యం సాధించిందని ఎలా చెప్తున్నార‌ని ప్ర‌శ్నించారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టంగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌డం వ‌ల్లే అది న‌మ్మి భార‌తీయులు పర్యటించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయార‌ని.. భారీ భ‌ద్ర‌త ఉన్న‌ప్పుడు ఉగ్ర‌మూక‌లు దాడి ఎలా చేసార‌ని అన్నారు. ప‌హ‌ల్గాం నిందితుల‌ను ప‌ట్టుకుని వారిని శిక్షించ‌డమో చంప‌డ‌మో చేసాకే ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌య‌వంతం అయిన‌ట్ల‌ని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *