Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు

Virat Kohli: రోహిత్ శ‌ర్మ త‌ర్వాత విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణాయ‌న్ని ప్ర‌కటించారు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు వెల్ల‌డించారు. త‌న సుదీర్ఘ‌మైన 14 ఏళ్ల‌ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్తున్నాన‌ని.. ఈ ఫార్మాట్ త‌న‌లో ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో.. ఎన్ని గుణ‌పాఠాలు నేర్పిందో చెప్ప‌లేన‌ని విరాట్ తెలిపారు. ఈ ఫార్మాట్ నుంచి త‌ప్పుకోవ‌డం త‌న‌కు చిన్న విష‌యం కాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ స‌మయంలో ఇదే క‌రెక్ట్ అనిపిస్తోంద‌ని.. వెన‌క్కి తిరిగి త‌న టెస్ట్ క్రికెట్ కెరీర్ చూసుకుంటే ఎన‌లేని జ్ఞాప‌కాలతో ఒక చిరున‌వ్వు మాత్ర‌మే వ‌స్తుంద‌ని తెలిపారు. Virat Kohli

2011లో వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్ స‌మ‌యంలో విరాట్ టెస్ట్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు.

2014లో టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అయ్యాడు.

2024 వ‌ర‌కు టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ 8700 ప‌రుగులు తీసాడు.

29 టెస్ట్ సెంచ‌రీలు, 7 డ‌బుల్ సెంచరీలు విరాట్ సొంతం

సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో విరాట్ చేసిన 254 (నాటౌట్) బెస్ట్ స్కోర్

విరాట్ కెప్టెన్సీలోనే ఇండియ‌న్ టెస్ట్ క్రికెట్ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది.

2021లో తొలి WTC ఫైన‌ల్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

2022లో టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా త‌ప్పుకున్న విరాట్ ఈరోజు టెస్ట్ క్రికెట్‌కి పూర్తిగా వీడ్కోలు ప‌లికాడు. Virat Kohli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *