Lokesh Kanagaraj: RRR లాంటి సినిమా తీయ‌ను

Lokesh Kanagaraj: కోలీవుడ్‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్.. మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లాంటి వారు. రాజ‌మౌళికి ఫ్లాప్స్ ఎలాగైతే లేవో.. లోకేష్ సినిమాల‌న్నీ కూడా హిట్టే. ఇప్పుడు ఆయ‌న కూలీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌తో పాటు మ‌న కింగ్ నాగార్జున కూడా న‌టించారు. ఈ సినిమాను ముందు ర‌జినీకాంత్‌నే సోలోగా పెట్టి తీయాల‌నుకున్న లోకేష్ ఆ త‌ర్వాత ప‌లు మార్ప‌లు చేసి మ‌ల్టీస్టార‌ర్‌గా రూపొందిస్తున్నారు. నాగార్జున‌తో పాటు బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ ఉపేంద్ర‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా లోకేష్ ఇంట్రెస్టింగ్స్ కామెంట్స్ చేసారు. తాను కూలీ అనే మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీస్తున్న‌ప్ప‌టికీ RRR లాంటి సినిమాలు మాత్రం తీయ‌నని అన్నారు. అలా మూడు నాలుగు ఏళ్ల పాటు న‌టీన‌టుల చేత ఒకే సినిమా చేయించ‌న‌ని అన్నారు. అందుకే త‌న సినిమా షూటింగ్ 6 నుంచి 8 నెల‌ల వ‌ర‌కు మాత్ర‌మే జ‌రుగుతుంద‌ని.. ఆ స‌మ‌యంలో త‌న సినిమాలో న‌టిస్తున్న వారు మాత్రం ఇత‌ర సినిమాల‌కు ఒప్పుకోకూడ‌ద‌నే రూల్‌ని పెట్టాల‌ని తెలిపారు. అలా మ‌ల‌యాళ న‌టుడైన సౌభిన్ షాహిర్ చేత 6,8 సినిమాల‌ను క్యాన్సిల్ చేయించాన‌ని అన్నారు. Lokesh Kanagaraj

ఇకపోతే.. ఇందులో మ‌న‌కు కింగ్ నాగార్జున లుక్ కీల‌కం. అస‌లు ఆయ‌నకు సినిమాలో స్క్రీన్ ప్రెసెన్స్ కానీ.. ఆయ‌న్ను స్టైలిష్‌గా కొన్ని యాంగిల్స్‌లో చూపించిన విధానం కానీ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు ద‌ర్శ‌కులు చేయ‌లేద‌ని.. కానీ లోకేష్ మాత్రం తెలుగు వారు ఎప్పుడూ చూడ‌ని కింగ్‌ను చూపించ‌బోతున్నార‌ని ఓ టాకైతే వినిపిస్తోంది. ఆగ‌స్ట్ 14న సినిమా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *