Yalda Hakim: లైవ్‌లో పాక్ ఇజ్జత్ తీసిన ఎవ‌రీ భామ‌?

Yalda Hakim: యాల్దా హకీం.. చూడ‌టానికి ఎంతో అందంగా క‌నిపించే ఈమె జ‌ర్న‌లిజం ఫీల్డ్‌లో సివంగి అనే చెప్పాలి. ఆస్ట్రేలియాకి చెందిన స్కై న్యూస్ త‌ర‌ఫున ప‌నిచేస్తున్న న్యూజ్ ప్ర‌జెంట‌ర్. మొన్న‌టి వ‌ర‌కు యాల్దా హ‌కీం ఎవ‌రో ఎవ్వ‌రికీ తెలీదు. కానీ ఎప్పుడైతే పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ్వాజా అసీఫ్‌ని ఇంట‌ర్వ్యూ చేసి కీల‌క స‌మాచారం రాబ‌ట్టిందో అప్ప‌టి నుంచి యాల్దా సెల‌బ్రిటీ అయిపోయింది. యాల్దా చేసిన ఇంట‌ర్వ్యూ వ‌ల్లే పాక్ వ‌క్ర బుద్ధి ప్ర‌పంచానికి తెలిసింది. యాల్దా చేసిన ఇంట‌ర్వ్యూలోనే ఖ్వాజా అసీఫ్.. అవును 30 ఏళ్లుగా అమెరికాతో పాటు ఇత‌ర దేశాల మెప్పు కోసం మేం ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తూ భార‌త్ పైకి వ‌దులుతున్నాం. ఇది మేం చేసిన చెత్త ప‌ని అని ఒప్పేసుకున్నారు.

అసీఫ్ తర్వాత యాల్దా మ‌రో పాకిస్థానీ నేత అయిన త‌రార్‌ను ఇంట‌ర్వ్యూ చేసారు. ఈ ఇంట‌ర్వ్యూలో యాల్దా ఆప‌రేష‌న్ సింధూర్ గురించి త‌రార్‌ను ప్ర‌శ్నించగా.. ఎర్రి పుష్పంలా స‌మాధానం ఇచ్చాడు. ఉగ్ర‌వాదానికి పాకిస్థాన్ ఎంతో కాలంగా బాధిత దేశంగా ఉంది. మేం కూడా ఉగ్ర‌వాదం వ‌ల్ల అల్లాడిపోతున్నాం. ఈ విష‌యం చెప్తే భార‌త్ న‌మ్మ‌డం లేదు.. అన్నాడు. దీనికి యాల్దా వెంట‌నే కౌంట‌ర్ ప్ర‌శ్న వేస్తూ.. అవునా? మ‌రి మొన్న మీ ర‌క్ష‌ణ శాఖ మంత్రే క‌దా మీరే ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్నాం అని లైవ్‌లో ఒప్పుకున్నారు. మీరు ఉగ్ర‌వాదానికి బాధితులైతే మ‌రి ఒసామా బిన్ లాడెన్ మీ పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో ఉన్న మిలిట‌రీ క్యాంప్ దగ్గ‌రే ఎలా త‌ల‌దాచుకున్నాడు అని మొఖం పగిలేలా ప్ర‌శ్నించింది.

Yalda Hakim
Yalda Hakim

దీనికి త‌రార్ ఎలా స‌మాధానం చెప్పాలో ముఖం ఎక్క‌డ పెట్టుకోవాలో తెలీక‌.. మిలిట‌రీ క్యాంప్ ద‌గ్గ‌ర లాడెన్ లేడు. లాడెన్ దాక్కున్న ప్రాంతానికి మిలిట‌రీ క్యాంప్ చాలా దూరంలో ఉంది అని త‌లా తోకా లేని స‌మాధానం చెప్పి జోక‌ర్ అయ్యాడు. అలా యాల్దా హ‌కీం ఎప్ప‌టిక‌ప్పుడు పాకిస్థాన్ నేత‌లను ఇంట‌ర్వ్యూ చేస్తూ వారికి తెలీకుండా వారిని లైవ్‌లో నిజాలు ఒప్పుకునేలా చేస్తోంది. అఫ్గానిస్థాన్‌లో పుట్టిన యాల్దా హ‌కీం ఆ త‌ర్వాత త‌న కుటుంబంలో ఆస్ట్రేలియాలో స్థిర‌ప‌డింది. ఇప్పుడు ఆమె ఆస్ట్రేలియాలో పేరుమోసిన జ‌ర్న‌లిస్ట్. దేనికీ భ‌య‌ప‌డ‌కుండా నిజాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే త‌త్వం త‌న‌ది. ఏ దేశానికి వెళ్లినా ముందు అక్క‌డ ఓ సెలూన్‌కి వెళ్లి హెయిర్ క‌ట్ లాంటివి చేయించుకుని ఆ త‌ర్వాత గ్రౌండ్ రిపోర్టింగ్‌లోకి దిగ‌డం త‌న‌కు అల‌వాటు అని యాల్దా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *