Pawan Kalyan: కుక్క‌ల్లా ఎవ్వ‌రూ పోస్ట్‌లు పెట్ట‌ద్దు

Pawan Kalyan: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు అని హెచ్చ‌రించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భార‌త ఆర్మీ పాకిస్థాన్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున చేసిన మెరుపు దాడుల (ఆప‌రేష‌న్ సింధూర్) నేప‌థ్యంలో ప‌వన్ స్పందించారు.

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమ‌ని. పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ మిలటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. కేవలం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విష‌మ‌ని అన్నారు. అహింస అహింస అంటూనే మ‌హాత్మా గాంధీని అనుస‌రించి ఇంత దాకా తెచ్చుకున్నామ‌ని.. ఇంకా ఆయ‌న సిద్ధాంతాలే పాటించాలంటే కుద‌ర‌ని ప‌ని అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *