Gutha Sukender Reddy: న‌న్ను పిలుస్త‌లేరు..!

Gutha Sukender Reddy: జాతిర‌త్నాలు సినిమాలో విల‌న్ న‌న్నెందుకు పొడిచావు రా అంటే.. నువ్వు నాకు కేక్ పెట్ట‌లే అన్న‌ట్లు.. ఎందుకు అలిగారు అని గుత్తా సుఖేంద‌ర్‌ని అడిగితే.. మీరు న‌న్ను పిలుస్త‌లేరు అని కాంగ్రెస్ నేత‌లతో త‌న బాధ‌ను చెప్పుకున్నార‌ట‌. రాష్ట్రంలో ఎలాంటి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా త‌న‌ను పిల‌వ‌డం లేద‌ని ఆయన ఫీల్ అయ్యారు. నల్గొండ జిల్లాకి చెందిన‌ ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో తనను పిలవట్లేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గుత్తా ఫిర్యాదు చేసారు. మండలి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన తనకు ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ సైతం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయారు.
ఇటీవల నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ కోటాలో 4 కోట్ల రూపాయల పనులను గుత్తా ప్రతిపాదించగా ఇంఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. నల్గొండ కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇవ్వగా పనులు సైతం ప్రారంభం అయ్యాయి. సడన్‌గా ఏమైందో కానీ గుత్తాకు సమాచారం ఇవ్వకుండా వర్క్ ఆర్డర్లు రద్దు చేశారు. దీంతో మనస్తాపం చెందిన గుత్తా.. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కలెక్టర్‌కు సభా హక్కుల నోటీస్ ఇవ్వగా కోమటిరెడ్డి జోక్యంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *