Chamala Kiran Kumar: కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసారు. పహల్గాం ఘటనపై పవన్ స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి ఇది సినిమా కాదని.. మోదీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి రెండు, మూడు సినిమాలు తీసుకోవాలని సెటైర్ వేసారు. అంతేకానీ ఎవరు ఏది రాసిస్తే అది చదవద్దు అంటూ హితవు పలికారు. దేశ సరిహద్దులో నుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం మోదీకి చేతకాదు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే సెక్యులర్ పార్టీ అని.. ఇది దేశాన్ని కాపాడు పార్టీ అని ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మాటలు తిన్నగా రావాలంటూ కౌంటర్ ఇచ్చారు.