Shashi Tharoor: ర‌క్తం కచ్చితంగా పారుతుంది.. కాక‌పోతే పాక్‌లో

Shashi Tharoor: జ‌మ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో భార‌తీయ ప‌ర్యాట‌కుల‌పై దాడి చేయించిందే కాకుండా సింధూ నది జ‌లాల‌ను ఆపేసినందుకు వ‌క్ర‌బుద్ధి పాకిస్థాన్ పిచ్చి కూత‌లు కూస్తోంది. ఆ దేశ నేత బిలావ‌ల్ బుట్టో సింధూ న‌ది మాది.. ఇక్క‌డ పారే ప్ర‌తి నీటి చుక్క మాదే.. ఈ నీటిని ఆపేస్తే న‌దిలో పారేది నీరు కాదు భార‌తీయుల నెత్తురు అని వాగాడు.

దీనిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్ ఘాటుగా బ‌దులిచ్చారు. ర‌క్తం క‌చ్చితంగా పారుతుంది కానీ.. ఆ ర‌క్తం పాకిస్థాన్‌దే అవుతుంద‌ని సెటైర్ వేసారు. ప‌హ‌ల్గాంలో హిందువుల‌పై జ‌రిగిన దాడి ప‌ట్ల దేశ ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నార‌ని.. క‌చ్చితంగా రివెంజ్ కావాల‌ని అడుగుతున్నార‌ని అన్నారు. ఆ రివెంజ్ భార‌త్ ఎప్పుడు, ఎక్క‌డ, ఎలా తీర్చుకుంటుందో మాత్రం ఎవ్వ‌రికీ తెలీద‌ని అంద‌రితో పాటు తాను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *