నువ్వెవ‌త్తివే .. హైకోర్టులోనే జ‌డ్జికి బెదిరింపులు

Delhi High Court: ఓ జ‌డ్జిని ప‌ట్టుకుని ఏకంగా కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు నిందితుడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీ హైకోర్టులో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ద్వార‌కాలో ఉన్న కోర్టులో ఏప్రిల్ 2న చెక్ బౌన్స్ కేసు హియ‌రింగ్‌కి వ‌చ్చింది. ఆరేళ్లుగా న‌డుస్తున్న ఈ కేసులో జ‌డ్జి శివాంగి మంగ్లా తీర్పు ఇస్తూ నిందితుడిని దోషిగా తేల్చింది. చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి 22 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు రూ.6.65 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తూ న్యాయ‌మూర్తి శివాంగి తీర్పు వెల్ల‌డించారు. 

తీర్పు చెప్పిన అనంత‌రం.. నిందితుడు నువ్వెత్తివే న‌న్ను దోషిగా తేల్చ‌డానికి. నువ్వు బ‌య‌ట కాలు పెట్టి చూడు ఇంటికి ప్రాణాల‌తో ఎలా వెళ్తావో నేనూ చూస్తా అని కేక‌లు వేసాడు. దాంతో పోలీసులు వెంట‌నే అత‌న్ని అక్క‌డి నుంచి లాక్కుని వెళ్లారు. కొంత‌కాలంగా అత‌ను, అత‌ని త‌ర‌ఫు న్యాయ‌వాది అరుణ్ కుమార్ జ‌డ్జిని రాజీనామా చేయాల‌ని టార్చ‌ర్ పెడుతున్నార‌ట‌. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌స్తావిస్తూ వెంట‌నే ఈ విష‌యంలో జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *