Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ త్రిషపై చేసిన కామెంట్ కాస్త వైరల్ అవుతోంది. కమల్, త్రిష, శింబు కలిసి తాము నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో త్రిష తన ఆహారపు అలవాట్ల గురించి చెప్తూ.. తనకు అరటి పండు నేరుగా తినడం కంటే ఉడకబెట్టి తినడం ఇష్టం అన్నారు. అప్పుడు కమల్ హాసన్.. అదేంటి.. ఏమంటారు దాన్ని అని అడిగారు. దీనికి త్రిష.. ఏమంటారో తెలీదు అన్నారు. అప్పుడు కమల్.. దానిని ఏమంటారో తెలీదు కానీ నోట్లో పెట్టుకోవడం తెలుసా అన్నారు. ఆయన మాటలకు అంతా పగలబడి నవ్వుకున్నారు. ఇక దీనిపై నెటిజన్లు ద్వంద్వార్థాలు తీస్తూ పిచ్చి రాతలు రాస్తున్నారు.