చిరంజీవి సినిమాతో నా రోగం బ‌య‌ట‌ప‌డింది

Chiranjeevi: పెద్ద పెద్ద డాక్ట‌ర్లు క‌నుక్కోలేని రోగం.. ఓ సినిమా ద్వారా బ‌య‌ట‌ప‌డిందంటే న‌మ్ముతారా? కానీ ఇది నిజం. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ద్వారా ఓ అమ్మాయి తాను చాలా కాలంగా బాధ‌ప‌డుతున్న రోగాన్ని బ‌య‌ట‌పెట్టింది. వైష్ణ‌వి వ‌ర్మ అనే ఓ మెడికో విద్యార్థినికి కొంత‌కాలంగా విప‌రీతమైన ఆక‌లి, దాహం వేస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలో బ‌రువు కూడా త‌గ్గింది. అస‌లు త‌న‌కు ఏమవుతోందో తెలుసుకునేందుకు ఎంద‌రో వైద్యుల‌ను సంప్ర‌దించింది.

వారంతా ఏవేవో ప‌రీక్ష‌లు చేసినా అస‌లు రోగం ఏంటో క‌నుక్కోలేక‌పోయారు. ఈ క్ర‌మంలో వైష్ణ‌వి శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూస్తుండ‌గా.. అందులో చిరంజీవి చెప్పిన కొన్ని రోగాల పేర్ల‌లో ఓ రోగానికి ఉన్న ల‌క్ష‌ణాలు త‌న‌లో కూడా ఉండ‌టం గ‌మ‌నించింది. వెంట‌నే ఆ రోగం గురించి తెలుసుకుని వైద్యున్ని సంప్ర‌దించ‌గా.. త‌న‌కు కూడా అదే రోగం అని తెలిసిందట‌. ఈ విష‌యాన్ని ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించ‌డంతో వైరల్‌గా మారింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *