NTR Neel: ఇక మొద‌లెడ‌దామా

NTR Neel: యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం వచ్చేసేంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న డ్రాగ‌న్ సినిమా షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి మొద‌లుకానుంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఈరోజు షూటింగ్ నిమిత్తం క‌ర్ణాట‌క‌కు బ‌య‌లుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇదొక ప్యూర్ ప్యాన్ వ‌ర‌ల్డ్ స్ట‌ఫ్‌గా ఉండ‌బోతోంద‌ని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేస్తున్నారు.  1960ల్లో బంగ్లాదేశ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లా ఓ పీరియాడిక్ సినిమాగా ఉండ‌బోతోంది. బంగ్లాదేశ్‌కు వ‌ల‌స వ‌చ్చిన తెలుగు వారిని కాపాడేందుకు రంగంలోకి దిగే ఫైట‌ర్‌గా తార‌క్ క‌నిపించ‌బోతున్నారు. గోల్డెన్ ట్రాయాంగిల్ (భార‌త్, చైనా, భూటాన్ స‌రిహ‌ద్దులు) వ‌ద్ద జ‌రిగే బంగారం అక్ర‌మ ర‌వాణా అంశం కూడా ఇందులో ఉండబోతోంద‌ట‌.  క‌ర్ణాట‌క‌లో కొంత చిత్రీక‌ర‌ణ జ‌రిపి మిగ‌తాది రామోజీ ఫిలిం సిటీలో తీస్తారు. స‌ప్త‌సాగ‌రాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మ‌లయాళ న‌టులు టోవినో థామ‌స్, బిజు మేన‌న్‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *