అయ్యిందా.. బాగా అయ్యిందా..!

Revanth Reddy: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ మొట్టికాయ‌లు వేసారు. అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడతాడు? ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు? ఇంతకు ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మళ్లీ మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిపై గ‌వాయ్ గుస్సా అయ్యారు. ఇక‌నైనా రేవంత్ కాస్త ప‌ద్ధ‌తిగా ముఖ్య‌మంత్రిగా న‌డుచుకుంటే మంచిది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *