Search The Query
Search

Image
  • Home
  • Politics
  • రేవంత్ అదానీని ప‌క్క‌న‌పెడితే బాగుంటుంది

రేవంత్ అదానీని ప‌క్క‌న‌పెడితే బాగుంటుంది

YS Sharmila Comments on Modi Adani YS Jagan mohan reddy Revanth Reddy పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మోసాల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఏ ఒక్క భార‌త‌దేశ సంస్థ కూడా బ‌య‌ట‌పెట్ట‌లేదు కానీ అమెరికాకి చెందిన సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ సంస్థ బ‌య‌ట‌పెట్టింద‌ని అన్నారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌ (YS Sharmila). సోలార్ పవ‌ర్ ప్రాజెక్ట్ విష‌యంలో అదానీ 218 మిలియ‌న్ డాల‌ర్లు లంచాలు ఇచ్చి ల‌క్ష‌ల కోట్ల కాంట్రాక్టులు పొందార‌ని అమెరికాకి చెందిన ఫెడ‌ర్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేష‌న్ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు ఆయ‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అదానీ నుంచి లంచాలు తీసుకున్న‌వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అదానీ నుంచి జ‌గ‌న్ రూ.1700 కోట్లను లంచంగా తీసుకున్నార‌ట‌.

ఆంధ్ర రాష్ట్రం కాస్తా అదానీ రాష్ట్రంగా మారింది

ఈ ఘ‌ట‌నపై వైఎస్ ష‌ర్మిళ మాట్లాడుతూ త‌న సోద‌రుడిపై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. డిస్కంల‌ను, ప‌వ‌ర్ యూనిట్ల‌ను అధిక ధ‌ర‌ల‌కు అమ్మేసి రూ.1700 కోట్లు తీసుకున్న జ‌గ‌న్‌పై (Jagan Mohan Reddy) వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) విచార‌ణ వేయాలని అన్నారు. డేటా సెంబ‌ర్ పెడితే ప్ర‌జ‌ల‌కు 40 వేల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అదానీ జ‌గ‌న్‌కు చెప్ప‌డంతో అదంతా న‌మ్మేసి ఆయ‌న చేతికి ఎన్నో కాంట్రాక్టులు ఇచ్చేసార‌ని అన్నారు. ఈ సోలార్ ప‌వ‌ర్ డీల్ మాత్ర‌మే కాకుండా జ‌గ‌న్ హ‌యాంలో అదానీతో జ‌రిగిన డీల్స్ అన్నింటిపై విచార‌ణ వేయాల్సిందేనని డిమాండ్ చేసారు.

ఇదే మోదీకే సిగ్గు చేటు

YS Sharmila Comments on Modi Adani YS Jagan mohan reddy Revanth Reddy భార‌తదేశానికి కాప‌లా కుక్క‌లుగా ఉంటామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) అంటుంటార‌ని.. అవి కేవ‌లం మాట‌ల వ‌ర‌కే ప‌రిమితమ‌ని ఈరోజు దేశ‌మంత‌టగా అర్థ‌మైపోయింద‌ని షర్మిళ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఎంతో కాలంగా గొంతు చించుకుని అదానీపై విచారణ చేప‌ట్టాల‌ని చెప్తున్నా కూడా మోదీ అస‌లు ప‌ట్టించుకోలేద‌ని.. ఈరోజు అదానీ ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రిగా ఉన్నారంటే అందుకు మోదీనే కారణ‌మ‌ని మండిప‌డ్డారు.

భార‌త‌దేశంలోని సెబీ కానీ, ఈడీ కానీ, ఇన్‌కం ట్యాక్స్ శాఖ కానీ సీబీఐ కానీ ఎవ్వ‌రూ కూడా అదానీ మోసాల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోయార‌ని వారంతా మోదీ చెప్పు చేత‌ల్లో ఉన్నారు కాబ‌ట్టే ఈరోజు అమెరికా ఈ మోసాల‌ను బ‌య‌ట‌పెట్టింద‌ని అన్నారు. అమెరికా, భార‌త్ ఒప్పందం ప్ర‌కారం.. ఇరు దేశాల‌కు చెందిన పౌరులు ఎవ‌రైనా ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డితే అయితే ఎక్స్‌ట్రాడైట్ (అప్ప‌గించ‌డం) చేయాల‌ని లేదా అదే దేశంలో ప్రాసిక్యూట్ (శిక్షించ‌డం) చేయాల‌ని ఉంద‌ని.. మ‌రి మోదీ అదానీ విష‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఆయ‌న ఇష్ట‌మ‌ని అన్నారు. వెంట‌నే అదానీని ఇండియాలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల‌ని డిమాండ్ చేసారు.

రేవంత్ అదానీతో డీల్ వ‌ద్దు

అదానీని దొంగ అని ఎన్నోసార్లు తిట్టిపోసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు తెలంగాణ‌లో అదానీతో పెట్టుబ‌డులు పెట్టించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో అదానీ నుంచి రేవంత్‌కు రూ.100 కోట్లు ముడుపులు అందాయ‌ని భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిళ రేవంత్‌కు ఓ స‌ల‌హా ఇచ్చారు. అదానీని తెలంగాణ‌లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల‌ని.. అత‌నితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉంటే ప్ర‌జ‌లు హ‌ర్షిస్తార‌ని ష‌ర్మిళ అభిప్రాయ‌ప‌డ్డారు.

జ‌గ‌న్ విచార‌ణ చేయ‌లేదుగా

అదానీతో చేతులు క‌లిపి చంద్రబాబు నాయుడే స్కాంల‌కు పాల్ప‌డ్డార‌ని జ‌గ‌న్ అంటున్నార‌ని.. మ‌రి అదే నిజ‌మైతే ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఎందుకు చంద్ర‌బాబుపై విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా ష‌ర్మిళ ప్ర‌శ్నించారు. అదే నిజ‌మైతే విచార‌ణ చేయించి ఉంటే ఈరోజు జ‌గ‌న్‌కు బ‌దులు చంద్ర‌బాబు నాయుడి గురించి మాట్లాడుకునేవాళ్లం క‌దా అని అన్నారు.

More News

Mohit reddy, anusha, abhinay reddy perni kittu posing with jagan mohan reddy
YSRCP next generation leaders: వార‌సులు సిద్ధం
BySai KrishnaNov 17, 2025

YSRCP next generation leaders: 2029 ఎన్నిక‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టినుంచే న‌డుం బిగించింది. ఎప్ప‌టిక‌ప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం…

Supreme Court warning Speaker gaddam prasad kumar
Supreme Court warning Speaker: న్యూఇయ‌ర్ జైల్లో జ‌రుపుకుంటారా స్పీక‌ర్ గారూ..
BySai KrishnaNov 17, 2025

Supreme Court Warning Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చుర‌క‌లంటించింది. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై…

Saudi Arabia Mecca Masjid
Saudi Arabia Bus Accident: బ‌య‌ట‌ప‌డ్డ ఒకే ఒక్క‌డు
BySai KrishnaNov 17, 2025

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఈరోజు ఉద‌యం చోటుచేసుకున్న ఘోర బస్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఒకే ఒక్క‌డు…

Mehbooba Mufti addressing a crowd
Mehbooba Mufti: ఎర్ర‌కోట పేలుడుపై ముఫ్తీ షాకింగ్ కామెంట్స్
BySai KrishnaNov 17, 2025

Mehbooba Mufti: ఇటీవ‌ల ఢిల్లీలోని ఎర్ర‌కోట పేలుడుపై (Delhi Red Fort Blast) జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, PDP…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top